BREAKING
తల్లిదండ్రులైన దీపికా పదుకొనే, రవీర్ సింగ్.. రెండవ కూతురికి స్వాగతం పలికిన స్టార్ కపుల్ రేపు ఇరిగినేని తిరుపతి నాయుడు 88వ జయంతి ఉత్తమ్ చొరవతో కోదాడలో కొలువుల జాతర పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించాలి: జిల్లా వ్యవసాయ అధికారి ఉల్లోజు వినోద్‌కుమార్ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి:నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎంపీ చామల సంచలన ఆరోపణలు కేటీఆర్‌కు చెందిన భూములపై ఈడీ, ఐటీ కేసులు .. ఉండగానే బదలాయింపులు ఎలా జరిగాయి?: ఫిరంగి నాలా ఆక్రమణతోనే ఫామ్‌హౌస్ నిర్మాణం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఎంపీ ఆరోపణ కోదాడ జాబ్ మేళా లోఎంపికయినా 50 మంది కిట్స్ విద్యార్థినులు. అక్టోబర్ 9 నాటికి SIR తుది ఓటర్ల జాబితా ప్రచురణకు పకడ్బందీ చర్యలు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తల్లులు, పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడటానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి* గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలి శాఖల మధ్య సమన్వయంతో సకాలంలో భవనాల నిర్మాణం పూర్తి చేయాలి మంత్రి మంత్రి సీతక్క క్యూర్ ప‌రిధిలో 21వేల డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి ఈనెలాఖరులోగా ల‌బ్దిదారుల ఎంపిక పూర్తిచేయాలి దాదాపు 9వేల మందికి ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు క‌లెక్ట‌ర్ల‌తో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వీడియో కాన్ఫ‌రెన్స్ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణది కీలక పాత్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 24న జిల్లా సాఫ్ట్ బాల్ జూనియర్ జిల్లా ఎంపిక పోటీలు మద్యానికి డబ్బులు లేక రైలు కింద పడి వ్యక్తి మృతి

*రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు*

Select Suryaa Now
*రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు*

అదిలాబాద్, సూర్య ఉమ్మడి జిల్లా ప్రతినిధి:రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారని తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బంది తాము ప్రారంభించిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యేలా చూడాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు.

ముఖ్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ శాఖ సూచనల మేరకు ఆయా మండపాల నిర్వాహకులు, యువత తగిన జాగ్రత్తలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు.ఇదే విధంగా నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ప్రజలకు సీపీ సూచించారు.

అనంతరం పోలీస్ ప్రధాన కార్యాలయంలో గత ఐదు రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథుని శోభాయాత్రను సీపీ శ్రీ అంబర్ కిషోర్ ఝా ప్రారంభించారు. గణపతి విగ్రహాన్ని డప్పు వాయిద్యాల నడుమ పోలీస్ అధికారులు, సిబ్బంది,పిల్లలు, మహిళలు కోలాటాలు, ఆటపాటలతో ఆనందోత్సాహాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి గోదావరి నదిలో నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్,ఏవో శ్రీనివాస్,స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు బీమేష్,శ్రీనివాస్, ఆర్‌ఐలు శేఖర్, రమేష్,దామోదర్, మల్లేశం,సీసీ సందీప్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నవీన్, ఉపాధ్యక్షుడు తిరుపతి,సంయుక్త కార్యదర్శి ఓంకార్, సీపీఓ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది,ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. జె