BREAKING
సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా నంద్యాలలో మొక్కలు నాటిన రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ డివైడర్ను ఢీకొన్న కారు బోల్తా ముగ్గురికి గాయాలు కునాల్ ఖేము ‘వైబ్’ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రూ. 2.25 కోట్ల వసూళ్లు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులే శిల్పులు: ఘనంగా బీఎస్ఎంఏటీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం తల్లిదండ్రులైన దీపికా పదుకొనే, రవీర్ సింగ్.. రెండవ కూతురికి స్వాగతం పలికిన స్టార్ కపుల్ రేపు ఇరిగినేని తిరుపతి నాయుడు 88వ జయంతి ఉత్తమ్ చొరవతో కోదాడలో కొలువుల జాతర పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించాలి: జిల్లా వ్యవసాయ అధికారి ఉల్లోజు వినోద్‌కుమార్ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి:నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎంపీ చామల సంచలన ఆరోపణలు కేటీఆర్‌కు చెందిన భూములపై ఈడీ, ఐటీ కేసులు .. ఉండగానే బదలాయింపులు ఎలా జరిగాయి?: ఫిరంగి నాలా ఆక్రమణతోనే ఫామ్‌హౌస్ నిర్మాణం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఎంపీ ఆరోపణ కోదాడ జాబ్ మేళా లోఎంపికయినా 50 మంది కిట్స్ విద్యార్థినులు. అక్టోబర్ 9 నాటికి SIR తుది ఓటర్ల జాబితా ప్రచురణకు పకడ్బందీ చర్యలు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తల్లులు, పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడటానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి* గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలి శాఖల మధ్య సమన్వయంతో సకాలంలో భవనాల నిర్మాణం పూర్తి చేయాలి మంత్రి మంత్రి సీతక్క

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి:నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత

Select Suryaa Now
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి:నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత

 

????విజయం సంతోషాన్ని ఇస్తే ఓటమి కసిని పెంచుతుంది

????సర్పంచ్ పాలకూరీ రమాదేవి నరసింహ గౌడ్, ముచ్చపోతుల శ్రీనివాస్ లకు ఘన సన్మానం

మునుగోడు,మేజర్ న్యూస్:

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలనీ నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత విద్యార్థిని విద్యార్థులకు సూచించారు.శనివారం
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మునుగోడు అసెంబ్లీ స్థాయి కబడ్డీ, కో-కో, వాలీబాల్ క్రీడా పోటీల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడినారు.  క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో సైతం రాణించే అవకాశం ఉందన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం అలవడుతుందని తెలిపారు. విజేతలైన విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థి, విద్యార్థినులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.రెండు రోజుల పాటు నిర్వహించిన క్రీడాకారులకు అండగా నిలిచిన స్థానిక సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ దంపతులను, కి.శే ముచ్చపోతుల మారయ్య రాములమ్మ దంపతుల జ్ఞాపకార్థం రెండు రోజుల పాటు క్రీడాకారులకు అన్నదానం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ముచ్చపోతుల శ్రీనివాస్ లను ఎస్జిఎఫ్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.ఎస్జిఎఫ్ నియోజకవర్గం కన్వీనర్ పల్లెటి  చిన్న జంగయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు,ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు కొండ్రెడ్డి సత్తిరెడ్డి, మునుగోడు లయన్స్ క్లబ్ అధ్యక్షులు పాలకూరి నరసింహ గౌడ్, మాజీ సర్పంచ్ మిర్యాల వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ముచ్చపోతుల శ్రీనివాస్,వ్యాయామ ఉపాధ్యాయులు కున్రెడ్డి సుధాకర్ రెడ్డి,కె.విద్యాసాగర్,ఉపాధ్యాయులు మేకల అన్నపురెడ్డి రత్నయ్య,క్రీడాకారులు,నాయకులు ఆరేళ్ల సైదులు,విద్యార్థులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.