డివైడర్ను ఢీకొన్న కారు బోల్తా ముగ్గురికి గాయాలు
డివైడర్ను ఢీకొన్న కారు బోల్తా
ముగ్గురికి గాయాలు
కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కాన్వాయ్ లో గాయపడ్డ వ్యక్తులను గజ్వేల్ ఆస్పత్రికి తరలింపు
కుకునూరుపల్లి, ...కారు డివైడర్ కు ఢీకొని కారు బోల్తా, ముగ్గురికి గాయాలు ఈఘటన కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రపూర్ స్టేజ్ వద్ద జరిగింది. ఎస్ఐ బాలకిషన్ తెలిపిన వివరాల ప్రకారం గజ్వేల్ వాస్తవ్యులు, కరీంనగర్ నుండి గజ్వేల్ కు వెళ్లే క్రమంలో రామచంద్రపూర్ స్టేజ్ వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నది. హైదరాబాద్ వెళుతున్న కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కాన్వాయ్ ఆపి కారులో గాయపడ్డ వ్యక్తులను తన కాన్వాయ్ లో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడుతూ మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.