BREAKING
యాదాల సాయికిరణ్ జోరుతో టీడీపీలోకి భారీ చేరికలు గాజుల గణపతి ముసుగులో రాక్షస దందా.. జీవీఎంసీ 'జోన్-6'కి కమీషన్ల కక్కుర్తి! పశ్చిమ బెంగాల్‌లో మత విద్వేషాల కుట్ర కేసు: ఏజేయూపీ అధినేత హుమాయున్ కబీర్‌కు పోలీసుల సమన్లు చెస్ ఒలింపియాడ్: భారత్ జోరు.. స్పెయిన్‌పై 3-1 తేడాతో పురుషుల జట్టు ఘన విజయం చిన్న శ్రీను పెద్ద కథే! విదేశాల్లో ఘనంగా ‘సేవా పఖ్వాడా’ పాకిస్థాన్‌ బలూచిస్థాన్‌లో భారీ ఎన్‌కౌంటర్: 11 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా నంద్యాలలో మొక్కలు నాటిన రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ డివైడర్ను ఢీకొన్న కారు బోల్తా ముగ్గురికి గాయాలు కునాల్ ఖేము ‘వైబ్’ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రూ. 2.25 కోట్ల వసూళ్లు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులే శిల్పులు: ఘనంగా బీఎస్ఎంఏటీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం తల్లిదండ్రులైన దీపికా పదుకొనే, రవీర్ సింగ్.. రెండవ కూతురికి స్వాగతం పలికిన స్టార్ కపుల్ రేపు ఇరిగినేని తిరుపతి నాయుడు 88వ జయంతి ఉత్తమ్ చొరవతో కోదాడలో కొలువుల జాతర పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించాలి: జిల్లా వ్యవసాయ అధికారి ఉల్లోజు వినోద్‌కుమార్

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా నంద్యాలలో మొక్కలు నాటిన రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్

Select Suryaa Now
సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా నంద్యాలలో మొక్కలు నాటిన రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్

-రేపటి తరాలకు అందించే విలువైన కానుక పచ్చదనమే: మంత్రి ఫరూక్ పిలుపు

నంద్యాల అర్బన్:

భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్’ లో భాగంగా నంద్యాల పట్టణంలో ‘సేవా మేరా యోగదాన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు మరియు హరిత భవిష్యత్తు నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈరోజు మనం నాటే ప్రతి మొక్క భావితరాలకు అందించే అత్యంత విలువైన సేవా కానుక అని ఆయన తెలిపారు . స్వచ్ఛమైన గాలి, పచ్చదనంతో కూడిన ఆహ్లాదకర వాతావరణం, పర్యావరణ పరిరక్షణతో పాటు జీవవైవిధ్య సంరక్షణకు విస్తృతంగా మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు.
ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో సమాజ హిత కార్యక్రమాల్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, నంద్యాల పట్టణాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షించాలని మంత్రి ఫరూక్ కోరారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ,  నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్, రాజేష్ (బుజ్జి), అనుపూరు ఈశ్వర్, కొండారెడ్డి, బషీర్, ఉప్పరి సురేష్ కుమార్, అలీ, బెండకాయల ఇస్మాయిల్, మదర్సా, రవి, మరాఠీ సూరి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.