BREAKING
తల్లులు, పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడటానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి* గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలి శాఖల మధ్య సమన్వయంతో సకాలంలో భవనాల నిర్మాణం పూర్తి చేయాలి మంత్రి మంత్రి సీతక్క క్యూర్ ప‌రిధిలో 21వేల డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి ఈనెలాఖరులోగా ల‌బ్దిదారుల ఎంపిక పూర్తిచేయాలి దాదాపు 9వేల మందికి ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు క‌లెక్ట‌ర్ల‌తో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వీడియో కాన్ఫ‌రెన్స్ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణది కీలక పాత్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 24న జిల్లా సాఫ్ట్ బాల్ జూనియర్ జిల్లా ఎంపిక పోటీలు మద్యానికి డబ్బులు లేక రైలు కింద పడి వ్యక్తి మృతి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ఆసియా క్రీడల ప్రారంభోత్సవం వాతావరణ సవాళ్లకు భారత్ పరిష్కారాలు అందిస్తోంది: ప్రధాని నరేంద్ర మోదీ 51 వేల మందికి నియామక పత్రాలందించిన ప్రధాని మోదీ సెప్టెంబర్ 20న భారత్‌కు బిజీ షెడ్యూల్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనం నిర్మాణం కు ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర కృషి చేయాలి.... పలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. ఐఐటీ బాంబేలో విద్యార్థి బలవన్మరణం.. పరీక్షలో చాట్‌జీపీటీ వివాదం విదేశీ ఉద్యోగాల కోసం సువర్ణ అవకాశం

మద్యానికి డబ్బులు లేక రైలు కింద పడి వ్యక్తి మృతి

Select Suryaa Now
మద్యానికి డబ్బులు లేక రైలు కింద పడి వ్యక్తి మృతి

మద్యానికి డబ్బులు లేక రైలు కింద పడి వ్యక్తి మృతి

అనంతపురం బ్యూరో 

 

మద్యం సేవించేందుకు డబ్బులు లేక క్షణికావేశానికి లోనైన ఓ వ్యక్తి రైలు కింద పడి మృతి చెందిన ఘటన అనంతపురం–ప్రసన్నాయపల్లి రైల్వే మార్గంలో చోటుచేసుకుంది.

బుక్కరాయసముద్రం మండలం ఎల్‌బీ కాలనీకి చెందిన పోతి మాల రవి (35) బేల్దారీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. 2019లో అనంతపురానికి చెందిన సాయి లీలను వివాహం చేసుకున్న రవికి బసవరాజు (7), భవాని (4) ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా మద్యపానానికి బానిసైన రవి, తాను సంపాదించిన కూలి డబ్బుల్లో ఎక్కువ భాగాన్ని మద్యానికే ఖర్చు చేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

సుమారు నాలుగు నెలల క్రితం భార్యకు చెప్పకుండా అనంతపురానికి వచ్చిన రవి, తన మేనల్లుడు కుమార్‌తో కలిసి ఉంటూ కూలి పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 18న మధ్యాహ్నం భార్య సాయి లీల, మేనల్లుడు కుమార్‌కు ఫోన్ చేసి మద్యం తాగేందుకు రూ.100 ఇవ్వాలని అడిగాడు. వారి వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఫోన్ పెట్టేశాడు.

అదే రోజు అర్ధరాత్రి ప్రసన్నాయపల్లి–అనంతపురం రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే పట్టాలపై గుర్తుతెలియని రైలు/గూడ్స్ రైలు కింద పడి రవి మృతి చెందినట్లు సమాచారం వచ్చింది. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న మేనల్లుడు కుమార్, సాయి లీలకు సమాచారం అందించాడు. అనంతరం వారు అనంతపురం GGH మార్చురీకి చేరుకుని మృతదేహాన్ని రవి దిగా గుర్తించారు.

మద్యపానానికి డబ్బులు లేకపోవడంతో రవి క్షణికావేశంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పంచాయితీదారులు పేర్కొన్నారు. మృతికి ఇతర కారణాలు గానీ, ఎవరిపైనైనా అనుమానాలు గానీ లేవని వారు తెలిపారు. సంఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.