BREAKING
వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణది కీలక పాత్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 24న జిల్లా సాఫ్ట్ బాల్ జూనియర్ జిల్లా ఎంపిక పోటీలు మద్యానికి డబ్బులు లేక రైలు కింద పడి వ్యక్తి మృతి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ఆసియా క్రీడల ప్రారంభోత్సవం వాతావరణ సవాళ్లకు భారత్ పరిష్కారాలు అందిస్తోంది: ప్రధాని నరేంద్ర మోదీ 51 వేల మందికి నియామక పత్రాలందించిన ప్రధాని మోదీ సెప్టెంబర్ 20న భారత్‌కు బిజీ షెడ్యూల్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనం నిర్మాణం కు ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర కృషి చేయాలి.... పలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. ఐఐటీ బాంబేలో విద్యార్థి బలవన్మరణం.. పరీక్షలో చాట్‌జీపీటీ వివాదం విదేశీ ఉద్యోగాల కోసం సువర్ణ అవకాశం దేశవ్యాప్తంగా నాలుగు హైకోర్టులకు 14 మంది నూతన న్యాయమూర్తుల నియామకం.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల సత్యదేవుని నిత్య అన్నదానానికి రూ లక్ష విరాళం బ్రిటన్‌లో సిక్కు బస్సు డ్రైవర్‌పై దుండగుడి దాడి.. వాహనం హైజాక్ చేసి బీభత్సం

విదేశీ ఉద్యోగాల కోసం సువర్ణ అవకాశం

Select Suryaa Now
విదేశీ ఉద్యోగాల కోసం సువర్ణ అవకాశం


టామ్‌కామ్‌ ఆధ్వర్యంలో కోడంగల్‌లో సెప్టెంబర్‌ 22న ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌
జర్మనీ, అమెరికా, దుబాయ్‌, ఇజ్రాయెల్‌, ఆస్ట్రియా, ఐర్లాండ్‌ సహా పలు దేశాల్లో ఉద్యోగాలు
కోడంగల్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్‌ 19): విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే తెలంగాణ యువతకు టామ్‌కామ్‌ (TOMCOM) శుభవార్త అందించింది. తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో పలు దేశాల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ సెప్టెంబర్‌ 22న కోడంగల్‌లోని KADA (Kodangal Area Development Authority) కార్యాలయంలో నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నమోదిత రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ అయిన టామ్‌కామ్‌.. రాష్ట్రానికి చెందిన నైపుణ్యం, అర్ధ నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు విదేశాల్లో సురక్షితమైన, చట్టబద్ధమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోంది.
పలు దేశాల్లో విస్తృత ఉద్యోగ అవకాశాలు
జర్మనీ, ఆస్ట్రియా, ఐర్లాండ్‌, సౌదీ అరేబియా, మారిషస్‌, ఖతార్‌, ఇజ్రాయెల్‌, మలేషియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (దుబాయ్‌), అమెరికా తదితర దేశాల్లో వివిధ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
జర్మనీలో రిజిస్టర్డ్‌ నర్సులు, ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్‌ థెరపిస్టులు, అలాగే హెల్త్‌, నాన్‌-హెల్త్‌ విభాగాల్లో Ausbildung అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రియా, ఐర్లాండ్‌, సౌదీ అరేబియా, మారిషస్‌లో నర్సింగ్‌ ఉద్యోగాలు, ఖతార్‌లో హోమ్‌కేర్‌ నర్సుల పోస్టులు, ఇజ్రాయెల్‌లో హోమ్‌బేస్డ్‌ కేర్‌గివర్‌ ఉద్యోగాలు ఉన్నాయి.
దుబాయ్‌లో బైక్‌, ట్యాక్సీ డ్రైవర్లు, స్టీల్‌ ఫిక్సర్లు, ఆర్‌సీసీ వర్కర్లు, టైల్స్‌ మేసన్లు, షట్టరింగ్‌ కార్పెంటర్లు, స్కాఫోల్డింగ్‌ వర్కర్లు, బ్లాక్‌ ప్లాస్టర్‌ మేసన్లు, కన్‌స్ట్రక్షన్‌ హెల్పర్లు తదితర ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. మలేషియాలో కన్‌స్ట్రక్షన్‌ హెల్పర్లు, స్టీల్‌ ఫిక్సర్లు, పైప్‌ వెల్డర్లు, ఎక్స్‌కవేటర్‌, బ్యాక్‌హో ఆపరేటర్లకు అవకాశాలు ఉన్నాయి.
అమెరికాలో రిజిస్టర్డ్‌ నర్స్‌ (RN) ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్‌ నాలుగేళ్ల విద్యార్హతతో పాటు యాక్టివ్‌ ఇండియన్‌ RN లైసెన్స్‌, NCLEX‌ ఉత్తీర్ణత/ఎన్‌రోల్‌మెంట్‌, IELTS 6.5 లేదా OET గ్రేడ్‌-బీ వంటి అర్హతలు అవసరమని అధికారులు తెలిపారు.
అర్హత ఉన్న అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి
విదేశీ ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 22న కోడంగల్‌ KADA కార్యాలయంలో నిర్వహించే ఎన్‌రోల్‌మెంట్‌ కార్యక్రమంలో పాల్గొనాలని టామ్‌కామ్‌ ఎండీ ఏ. క్రాంతి వెస్లీ, ఐఏఎస్‌, KADA స్పెషల్‌ ఆఫీసర్‌ వెంకట్‌రెడ్డి కోరారు. విదేశీ ఉద్యోగాల కోసం మధ్యవర్తులను ఆశ్రయించకుండా, సురక్షితమైన మరియు చట్టబద్ధమైన మార్గాల ద్వారా అవకాశాలను పొందాలని సూచించారు.
మరిన్ని వివరాల కోసం www.tomcom.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అలాగే 080 3552 4946 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.