BREAKING
అనంతపురం నగరంలో ద్విచక్ర వాహనంలో మంటలు OCA డైరెక్టర్ జనరల్‌తో క్రీడల మంత్రి మన్సుఖ్ మండావియా భేటీ టైర్-2, టైర్-3 నగరాల్లోనే సగం స్టార్టప్‌లు యువతకు అపూర్వ అవకాశాలు నేపాల్‌కు భారత్ మరో 11 టన్నుల సహాయ సామాగ్రి రాబోయే 20 ఏళ్లలో భారత జీడీపీ 38 ట్రిలియన్ డాలర్లకు: అజిత్ దోవల్ సెప్టెంబర్ 21వ తేదీన సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ₹5,000 కోట్ల ఆస్తుల నగదీకరణకు ఎన్‌ఎల్‌ఎంసి సిఫార్సు నెక్స్ట్-జనరేషన్ మిస్సైల్ వెస్సెల్ ‘కీల్ లేయింగ్’ పూర్తి భారతదేశ తలసరి కార్బన్ ఉద్గారాలు ప్రపంచ సగటులో సగం కన్నా తక్కువ వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు న్యూఢిల్లీలో ఎన్‌జీటీ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ రక్షణ, పౌర సేవల కోసం సరికొత్త విమానాశ్రయం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి జపాన్‌లో మెరిసేందుకు సిద్ధమైన ఐదుగురు భారత ఆశాకిరణాలు ISSF జూనియర్ ప్రపంచ కప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

మహిళలు స్వయం ఉపాధిలో ముందుండాలి లి

Select Suryaa Now
 మహిళలు స్వయం ఉపాధిలో ముందుండాలి లి

మహిళలు స్వయం ఉపాధిలో ముందుండాలి

అల్లం స్వప్న - బాలకిశోర్ రెడ్డి

గీసుగొండ సెప్టెంబర్ 19 మేజర్ న్యూస్ (సూర్య)మహిళలు స్వయం ఉపాధిలో ముందుండాలని పారిశ్రామికవేత్త అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని యువత, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఎస్బిఐ ఆర్ఎస్ ఈటిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేకింగ్ క్రియేటివ్ జువెల్లరీ శిక్షణ కార్యక్రమం శనివారం గీసుగొండ గ్రామంలోని వివో కార్యాలయంలో జరిగింది.ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి,గీసుగొండ సర్పంచ్ వీరాగోని రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలు, యువతతో ఆమె మాట్లాడి,శిక్షణ ద్వారా పొందుతున్న నైపుణ్యాలు, భవిష్యత్తులో స్వయం ఉపాధి అవకాశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.2026 సెప్టెంబర్ 9 నుంచి 22వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ శిక్షణ కార్యక్రమం ఎస్బిఐ ఆర్ఎస్ఈటిఐ బ్యాచ్ నెంబర్ 27/2026-27లో భాగంగా నిర్వహించనున్నారు.సృజనాత్మక ఆభరణాల తయారీకి సంబంధించిన నైపుణ్యాలు,తయారీ విధానాలు, మార్కెటింగ్ అవకాశాలు,స్వయం ఉపాధి మార్గాలపై శిక్షణ అందిస్తున్నారు.ఈ సందర్భంగా అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి మాట్లాడుతూ,మహిళలు మరియు యువత శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచించారు.తమ ప్రతిభను చిన్న వ్యాపారంగా అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించడంతో పాటు, భవిష్యత్తులో మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మహిళలు, యువతకు స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబనకు మంచి అవకాశాలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఫార్మ్ డి.పి.ఎం వరలక్ష్మి, ఏపీఎం ఈశ్వరయ్య,ఇక్రి సాట్ శ్రీనివాస్,సి సి సురేష్,ఎస్బిఐ ఆర్ఎస్ ఈటిఐ ట్రైనర్ పుష్పవల్లి,వి.వో.ఏలు హేమలత,జ్యోతి,సరస్వతి భవాని, శిక్షకులు,శిక్షణార్థులు,స్థానికులు పాల్గొన్నారు.