BREAKING
మహిళలు స్వయం ఉపాధిలో ముందుండాలి లి పీ-4 స్ఫూర్తి ...మంత్రి ఫరూక్ చేతుల మీదుగా ఇంటర్ విద్యార్థికి రూ. 20,000 ఆర్థిక సాయం అందజేత జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి* మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరామర్శ కాసేపట్లో విశాఖపట్నం చేరుకోనున్న సీఎం చంద్రబాబు సముద్ర స్వచ్ఛతకు డ్రెయిన్ల ప్రక్షాళనే కీలకం: విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోదాడలో భారీ మెగా జాబ్ మేళా ప్రారంభం అద్భుతమైన చికిత్సతో పసిబిడ్డకు పునర్జన్మ శిశురక్ష ఆసుపత్రి వైద్యులను అభినందించిన జగ్గారెడ్డి. గణిత, గణాంక శాస్త్రంలో ఎం.నాగేష్ కు పీహెచ్.డీ. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల పంటలు ఎండాయి మాజీ మంత్రి శైలజానాథ్ ఎండిపోయిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఒంగోలు ఘన చరిత్రకు ఘనోత్సవం గణపతి మండపాన్ని సందర్శించిన దిల్ రాజు అక్టోబర్‌ 1న కరువు మండలాల ప్రకటన పంటలు లేక.. పనుల కోసం వలస

మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరామర్శ

Select Suryaa Now
మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరామర్శ

*మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరామర్శ*

*రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం  అందచేసిన అల్లం స్వప్న బాలకిషోర్*


గీసుగొండ  సెప్టెంబర్ 19  మేజర్ న్యూస్ (సూర్య)మండలంలోని బాలయ్యపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు రాగిరి గణేష్,నల్ల సిద్ధార్థ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.విషయం తెలుసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి,జిల్లా నాయకులు గీసుగొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్,జిల్లా నాయకులు అల్లం మర్రెడ్డి శనివారం బాలయ్యపల్లి గ్రామానికి వెళ్లి మృత విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు.మృత విద్యార్థుల కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా రాగిరి గణేష్ తల్లిదండ్రులు లింగమూర్తి,అనిత, అలాగే నల్ల సిద్ధార్థ తల్లిదండ్రులు అశోక్, ఉమా దంపతులను పరామర్శించి ఓదార్చారు.అనంతరం రాగిరి గణేష్ కుటుంబానికి రూ.10వేలు,నల్ల సిద్ధార్థ కుటుంబానికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో గీసుకొండ మాజీ సర్పంచులు కోల కుమారస్వామి,దౌడు బాబు, మాజీ ఉపసర్పంచ్ పొగాకు బిక్షపతి,గీసుకొండ సొసైటీ డైరెక్టర్ దౌడు సునీల్,వార్డు మెంబర్ పసుల యుగేందేర్,గాడిదుల బొంద్యాలు,కందికొండ రాజు,బోయ అశోక్,చాపర్తి రాజమౌళి పాల్గొన్నారు.