BREAKING
భారత్‌తో టీ20 సిరీస్‌కు రచిన్ రవీంద్ర దూరం? గుత్తి పట్టణం నందు మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మహిళలు స్వయం ఉపాధిలో ముందుండాలి లి పీ-4 స్ఫూర్తి ...మంత్రి ఫరూక్ చేతుల మీదుగా ఇంటర్ విద్యార్థికి రూ. 20,000 ఆర్థిక సాయం అందజేత జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి* మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరామర్శ కాసేపట్లో విశాఖపట్నం చేరుకోనున్న సీఎం చంద్రబాబు సముద్ర స్వచ్ఛతకు డ్రెయిన్ల ప్రక్షాళనే కీలకం: విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోదాడలో భారీ మెగా జాబ్ మేళా ప్రారంభం అద్భుతమైన చికిత్సతో పసిబిడ్డకు పునర్జన్మ శిశురక్ష ఆసుపత్రి వైద్యులను అభినందించిన జగ్గారెడ్డి. గణిత, గణాంక శాస్త్రంలో ఎం.నాగేష్ కు పీహెచ్.డీ. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల పంటలు ఎండాయి మాజీ మంత్రి శైలజానాథ్ ఎండిపోయిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఒంగోలు ఘన చరిత్రకు ఘనోత్సవం గణపతి మండపాన్ని సందర్శించిన దిల్ రాజు

పీ-4 స్ఫూర్తి ...మంత్రి ఫరూక్ చేతుల మీదుగా ఇంటర్ విద్యార్థికి రూ. 20,000 ఆర్థిక సాయం అందజేత

Select Suryaa Now
పీ-4 స్ఫూర్తి ...మంత్రి ఫరూక్ చేతుల మీదుగా ఇంటర్ విద్యార్థికి రూ. 20,000 ఆర్థిక సాయం అందజేత

 

నంద్యాల అర్బన్ :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ-4 (పీపుల్-పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) స్ఫూర్తితో పేద విద్యార్థుల ఉన్నత చదువులకు దాతలు ముందుకొచ్చి అండగా నిలవడం అభినందనీయమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు . నంద్యాల టౌన్ 19 వార్డ్ పోన్నాపురం గ్రామానికి చెందిన పేద విద్యార్థి ఎడవల్లి వసంత కుమార్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుండగా, అతని ఆర్థిక పరిస్థితిని గుర్తించి గోస్పాడు మండలం ఎం. కృష్ణాపురం గ్రామానికి చెందిన ప్రముఖ దాతలు దండే రవీంద్రనాథ్ రెడ్డి, దండే రంగ శేఖర్ రెడ్డి రూ. 20,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పీ-4 నంద్యాల నియోజకవర్గ యంగ్ ప్రొఫెషనల్ వెంకట చెన్నయ్య సమన్వయంతో, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేతుల మీదుగా విద్యార్థి ఎడవల్లి వసంత కుమార్‌కు ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు నిరుపేద విద్యార్థులకు ఇలా చేయూతనిచ్చి వారి భవిష్యత్తుకు బాటలు వేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన దాతలు దండే రవీంద్రనాథ్ రెడ్డి, దండే రంగ శేఖర్ రెడ్డి లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

సకాలంలో ఆర్థిక సాయం అందేలా చొరవ చూపిన మంత్రి ఫరూక్ గారికి, దాతలకు, పీ-4 ప్రతినిధులకు విద్యార్థి మరియు అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.