ఎండిపోయిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్
అనంతపురం బ్యూరో
వైఎస్ జగన్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలోకి వైఎస్సార్‌సీపీ: నాగులగుడ్డం నుంచి ఈస్ట్ నరసాపురం వరకు ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి డాక్టర్ శైలజనాథ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శింగనమల నియోజకవర్గంలో మాజీ మంత్రి డాక్టర్ శైలజనాథ్ నేతృత్వంలో పంట పొలాల పరిశీలన కార్యక్రమం ఉధృతంగా సాగింది.
శింగనమల మండలం నాగులగుడ్డం గ్రామం నుంచి ఈస్ట్ నరసాపురం వరకు సాగునీరు అందక నిలువునా ఎండిపోతున్న పంట పొలాలను శైలజనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నేరుగా పొలాల్లోకి దిగి ఎండిపోయిన పైర్లను పట్టుకుని, రైతుల పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
*ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ శైలజనాథ్ మాట్లాడుతూ:-*
"సాగునీటి నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ రోజు వేలాది ఎకరాల్లో పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. కష్టపడి పంట పండించిన రైతుకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతు పక్షపాతిగా ఉంటుంది. ఈ క్షేత్రస్థాయి నివేదికను, రైతుల ఆవేదనను తక్షణమే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం."
ప్రభుత్వం వెంటనే స్పందించి, ఎండిపోయిన పంటలకు సంబంధించి సమగ్ర సర్వే నిర్వహించి, నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకూ నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.