ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల పంటలు ఎండాయి మాజీ మంత్రి శైలజానాథ్
జిల్లాలోని రైతాంగానికి కన్నీరు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం వారి తీవ్రమైన నిర్లక్ష్యం కారణంగానే జిల్లాలోని రైతాంగానికి కన్నీటి బాధలు మిగిల్చాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతులకు పంటలకు అందించాల్సిన సాగునీటిని అందించకుండా ముందస్తు చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేపథ్యంలోనే ప్రస్తుతం రైతాంగానికి కన్నీరు మిగిలాయని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. శనివారం జిల్లాలోని సింగనమల నియోజకవర్గం లో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. రైతులతో ఎండిన పంటలకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆందోళనను వ్యక్తం చేశారు.