BREAKING
మహిమగల తల్లి గుబ్బల మంగమ్మ.. దట్టమైన అడవిలో కొలువైన గిరిజనుల ఆరాధ్య దైవం అమరలింగేశ్వరుడు.. ఉత్తరవాహిని కృష్ణానది ఒడ్డున గుహలో వెలసిన స్వయంభువు ది ప్యారడైజ్’ కంటెంట్ అద్భుతంగా వచ్చింది.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇంటర్వ్యూ విశేషాలు మెగాస్టార్ కొత్త సినిమా టైటిల్ సంచలనం: 'కాకా' అసలు అర్థమేంటో స్పష్టం చేసిన చిరంజీవి మృణాల్ ఠాకూర్ సస్పెన్స్ థ్రిల్లర్: నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. నేరుగా ఓటీటీలోకి 'పూజా మేరీ జాన్' హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్.. మెగాస్టార్ చిరంజీవి, ఏషియన్ సినిమాస్ భారీ ప్లాన్ T20Iల్లో స్మృతి, షెఫాలీ 'సిక్సర్ల' రికార్డ్: ఏషియన్ గేమ్స్‌లో భారత ఓపెనర్ల విధ్వంసకర ప్రదర్శన కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్వానంగా అంతర్గత రోడ్లు బాలాపూర్ గణనాథుని సన్నిధిలో విజయ్ దేవరకొండ.. ప్రత్యేక పూజలు నిర్వహించిన 'రణబాలి' హీరో! ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్.. పోలీసుల కాల్పుల్లో వాంటెడ్ డ్రగ్ పెడ్లర్‌కు తీవ్ర గాయాలు వినాయక నిమజ్జనంలో దిల్ రాజు దంపతుల మాస్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్! తిమ్మాపూర్ ఎస్‌బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి భారీ చోరీ… ఇట్లు అర్జున టీజర్ ఈవెంట్: చిన్ననాటి స్నేహితుడి కోసం వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న లేడీ డైరెక్టర్! ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ

కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

Select Suryaa Now
కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
 నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలను స్వీకరించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అనంతరం శ్రీ కొత్తమ్మతల్లి ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టడంలో భాగంగా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం ప్రజా వినతులను స్వీకరించారు. టెక్కలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, స్థానిక నేతలు తమ సమస్యలను మంత్రికి వివరించారు. ప్రతి అర్జీని స్వయంగా పరిశీలించిన మంత్రి, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.అనంతరం ప్రసిద్ధ శ్రీ కొత్తమ్మతల్లి ఉత్సవాల నిర్వహణపై కమిటీ సభ్యులతో మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున గతంలో కంటే మిన్నగా ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు.
 తాగునీరు, పారిశుద్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు, వైద్య శిబిరాలు, రవాణా సౌకర్యాలను ముందుగానే పూర్తి చేయాలి.ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, క్యూలైన్లు, ప్రత్యేక ప్రవేశ–నిష్క్రమణ ద్వారాలు ఏర్పాటు చేయాలి. వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు సమాచార సహాయ కేంద్రాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.