BREAKING
మహిళలు స్వయం ఉపాధిలో ముందుండాలి లి పీ-4 స్ఫూర్తి ...మంత్రి ఫరూక్ చేతుల మీదుగా ఇంటర్ విద్యార్థికి రూ. 20,000 ఆర్థిక సాయం అందజేత జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి* మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరామర్శ కాసేపట్లో విశాఖపట్నం చేరుకోనున్న సీఎం చంద్రబాబు సముద్ర స్వచ్ఛతకు డ్రెయిన్ల ప్రక్షాళనే కీలకం: విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోదాడలో భారీ మెగా జాబ్ మేళా ప్రారంభం అద్భుతమైన చికిత్సతో పసిబిడ్డకు పునర్జన్మ శిశురక్ష ఆసుపత్రి వైద్యులను అభినందించిన జగ్గారెడ్డి. గణిత, గణాంక శాస్త్రంలో ఎం.నాగేష్ కు పీహెచ్.డీ. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల పంటలు ఎండాయి మాజీ మంత్రి శైలజానాథ్ ఎండిపోయిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఒంగోలు ఘన చరిత్రకు ఘనోత్సవం గణపతి మండపాన్ని సందర్శించిన దిల్ రాజు అక్టోబర్‌ 1న కరువు మండలాల ప్రకటన పంటలు లేక.. పనుల కోసం వలస

కాసేపట్లో విశాఖపట్నం చేరుకోనున్న సీఎం చంద్రబాబు

Select Suryaa Now
కాసేపట్లో విశాఖపట్నం చేరుకోనున్న సీఎం చంద్రబాబు

 

కాసేపట్లో విశాఖపట్నం చేరుకోనున్న సీఎం చంద్రబాబు

 పేదల ఇళ్లకు పట్టాభిషేకం
రూ.8,874 కోట్ల విలువైన భూమిపై 28,445 కుటుంబాలకు హక్కులు
399 ఎకరాల భూమి క్రమబద్ధీకరణ.. 19.33 లక్షల చదరపు గజాలకు పట్టాలు
ఆరు నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు ఇళ్ల హక్కు పత్రాల పంపిణీ
దశాబ్దాల సమస్యకు పరిష్కారం.. విశాఖలో భారీ ఏర్పాట్లు
పేదల సొంతింటి కలకు హక్కులు.. లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు
కాసేపట్లో విశాఖపట్నం చేరుకోనున్న సీఎం చంద్రబాబు
  సూర్య, స్టేట్ బ్యూరో : 

కాసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం చేరుకోనున్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం చూపుతూ పేదల సొంతింటి కలకు శాశ్వత హక్కు కల్పించే కార్యక్రమంలో భాగంగా 28,445 కుటుంబాలకు ఇళ్ల హక్కు పట్టాలను సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. రూ.8,874 కోట్ల విలువైన భూమిపై లబ్ధిదారులకు హక్కులు కల్పిస్తూ పట్టాలు అందించనున్నారు. విశాఖలో ఇంత పెద్ద ఎత్తున భూమిని క్రమబద్ధీకరించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం ఇదే తొలిసారి. పేదల నివాస స్థలాలకు హక్కులు కల్పించేందుకు 11 మండలాల్లో 399 ఎకరాల భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఇందులో 19,33,853 చదరపు గజాల భూమి ఉంది. సభా ప్రాంగణం వద్దే లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గాలు, మండలాలు, వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. విశాఖ తూర్పులో 6,555, విశాఖ పశ్చిమంలో 5,093, విశాఖ ఉత్తరంలో 2,601, పెందుర్తిలో 2,851, గాజువాకలో 6,134, భీమిలిలో 5,211 కుటుంబాలకు పట్టాలు అందనున్నాయి. సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో విశాఖలోని వివిధ కాలనీల్లో సందడి నెలకొంది. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమానికి కూటమి నేతలు లబ్ధిదారులను ఆహ్వానించారు. ప్రభుత్వం పట్టాలు అందించడంతో తాము లక్షాధికారులుగా మారుతున్నామని పలువురు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పట్టాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంతో తమ నివాస స్థలాల ధరలు గణనీయంగా పెరిగాయని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమ నివాస స్థలాలను కోల్పోతామనే భయంతో గడిపామని పలువురు గుర్తుచేసుకుంటున్నారు. పెద్దజాలరిపేట వాసులు తమ నివాస స్థలాలను అడ్డుపెట్టుకుని గత వైసీపీ ప్రభుత్వం టీడీఆర్ బాండ్ల అంశాన్ని తెరపైకి తెచ్చిందని నాటి పరిస్థితులను గుర్తుచేశారు. 35 నుంచి 40 ఏళ్లుగా నివాసముంటున్న తమకు ఇప్పుడు ఇళ్లపై హక్కులు లభించడంతో ఆనందంగా ఉందని లబ్ధిదారులు పేర్కొన్నారు. మండలాల వారీగా చూస్తే విశాఖ రూరల్‌లో అత్యధికంగా 9,261 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ములగాడలో 4,213, గాజువాకలో 4,353, గోపాలపట్నంలో 3,253, పెందుర్తిలో 2,722, పెదగంట్యాడలో 1,910, మహారాణిపేటలో 1,235, సీతమ్మధారలో 668, భీమిలిలో 464, ఆనందపురంలో 349, పద్మనాభంలో 17 కుటుంబాలకు ఇళ్ల హక్కులు కల్పించనున్నారు.