జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి*
*జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి*
*కర్నూలు, సెప్టెంబర్ 19 : జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకొని వారికి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. ఎ. సిరి పేర్కొన్నారు.*
*శనివారం కలెక్టరేట్ ఛాంబర్ లో నైపుణ్యం అభివృద్ధి మరియు శిక్షణ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఉద్యోగ మేళా పోస్టర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్. ఎ.సిరిగారు, ఆలూరు టీడీపీ ఇంచార్జి వైకుంటం జ్యోతి గారు ఆవిష్కరించారు.*
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ శాఖ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాలో భాగంగా వివిధ రకాలైన 28 ప్రైవేటు కంపెనీలలో ఉన్న 1450 ఖాళీలను భర్తీ నిమిత్తం BJR HIGH SCHOOL , Alur లో September 24వ తేది, ఉ.9:30 గం.ల నుండి సా.4గం.ల వరకు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. సదరు జాబ్ మేళా లో పాల్గొనాలనుకునే యువతీ, యువకులు 18 సం.ల నుండి 35 సం.ల లోపు ఉండడంతో పాటు పదవ తరగతి నుండి డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, పిజి చదివిన వారు జాబ్ మేళాలో పాల్గొని ఉపాధి పొందే అవకాశం ఉంటుందన్నారు. అందుకు గాను ముందుగా Naipunyam.ap.gov.in లింక్ లో సదరు వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.*
*జిల్లా ఉపాధి అధికారిణి దీప్తి గారు మాట్లాడుతూ జాబ్ మేళాను యువత పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. జాబ్ మేళాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్న నంబర్లకు సంప్రదించగలరని తెలిపారు.*
9603303354,
9346243624
*కార్యక్రమంలో ఉపాధి కల్పన అధికారి దీప్తి మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.*
*--*