BREAKING
పలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. ఐఐటీ బాంబేలో విద్యార్థి బలవన్మరణం.. పరీక్షలో చాట్‌జీపీటీ వివాదం విదేశీ ఉద్యోగాల కోసం సువర్ణ అవకాశం దేశవ్యాప్తంగా నాలుగు హైకోర్టులకు 14 మంది నూతన న్యాయమూర్తుల నియామకం.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల సత్యదేవుని నిత్య అన్నదానానికి రూ లక్ష విరాళం బ్రిటన్‌లో సిక్కు బస్సు డ్రైవర్‌పై దుండగుడి దాడి.. వాహనం హైజాక్ చేసి బీభత్సం విగ్నేశ్వరస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి మహాకవి గురజాడ జయంతి రాష్ట్ర పండగే.. మరి జన్మభూమి ఎస్.రాయవరం సంగతేంటి? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే గర్వం, గుర్తింపు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వరకట్న వేధింపులతో బీటెక్ విద్యార్థిని మృతి ఈవీఎం గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా విశాఖలో టీ బోర్డ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రత్యేక టీ ప్రచార వేడుక ప్రారంభం 150 ఏళ్ల ఒంగోలు.. ఘన చరిత్రకు ఘన వేడుకలు! జలధార-జలహారతి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి- కలెక్టర్ రాజకుమారి గణియా AI యుగంలో నిరంతర అభ్యాసమే ఉద్యోగ భద్రతకు కీలకం: విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్..

న్యూఢిల్లీలో ఎన్‌జీటీ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ

Select Suryaa Now
న్యూఢిల్లీలో ఎన్‌జీటీ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ:న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “పర్యావరణం మరియు వాతావరణ గతిశీలత భవిష్యత్తు” అనే రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సెప్టెంబర్ 19, 20 తేదీలలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో భారతదేశంతో పాటు 17 దేశాలకు చెందిన పర్యావరణ నిపుణులు, న్యాయవ్యవస్థ ప్రతినిధులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు భాగస్వాములవుతున్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, ఎన్‌జీటీ ఛైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవలతో పాటు పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు మరియు వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.

ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన పర్యావరణ, వాతావరణ సవాళ్లను అధిగమించేందుకు విధాన రూపకల్పన, అమలులోని లోపాలను పరిశీలించడం, ఉత్తమ విధానాలను పంచుకోవడం మరియు సంస్థల మధ్య సహకారాన్ని పెంచడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని ఎన్‌జీటీ తెలిపింది. ఈ రెండు రోజుల్లో కీలక పర్యావరణ సమస్యలపై నాలుగు సాంకేతిక సమావేశాలు జరగనుండగా, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. కాగా, ఆదివారం జరిగే ముగింపు సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి మనోహర్ లాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నరసింహ, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.