BREAKING
ఆసియా క్రీడల ప్రారంభోత్సవం వాతావరణ సవాళ్లకు భారత్ పరిష్కారాలు అందిస్తోంది: ప్రధాని నరేంద్ర మోదీ 51 వేల మందికి నియామక పత్రాలందించిన ప్రధాని మోదీ సెప్టెంబర్ 20న భారత్‌కు బిజీ షెడ్యూల్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనం నిర్మాణం కు ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర కృషి చేయాలి.... పలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. ఐఐటీ బాంబేలో విద్యార్థి బలవన్మరణం.. పరీక్షలో చాట్‌జీపీటీ వివాదం విదేశీ ఉద్యోగాల కోసం సువర్ణ అవకాశం దేశవ్యాప్తంగా నాలుగు హైకోర్టులకు 14 మంది నూతన న్యాయమూర్తుల నియామకం.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల సత్యదేవుని నిత్య అన్నదానానికి రూ లక్ష విరాళం బ్రిటన్‌లో సిక్కు బస్సు డ్రైవర్‌పై దుండగుడి దాడి.. వాహనం హైజాక్ చేసి బీభత్సం విగ్నేశ్వరస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి మహాకవి గురజాడ జయంతి రాష్ట్ర పండగే.. మరి జన్మభూమి ఎస్.రాయవరం సంగతేంటి? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే గర్వం, గుర్తింపు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వరకట్న వేధింపులతో బీటెక్ విద్యార్థిని మృతి

విగ్నేశ్వరస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

Select Suryaa Now
విగ్నేశ్వరస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి


భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గడ్డం అనన్య
వికారాబాద్‌, మేజర్‌ న్యూస్‌ (సెప్టెంబర్‌ 19): వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని 32వ వార్డు శివరాంనగర్‌ కాలనీలో కౌన్సిలర్‌ బాదం అనురాధ అశోక్‌ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గడ్డం అనన్య, వికారాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చాపల శ్రీనివాస్‌ ముదిరాజ్‌, వైస్‌ చైర్మన్‌ మల్లేశం, మాజీ వైస్‌ చైర్మన్‌ సి. రమేష్‌ కుమార్‌ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మిక చింతనతో ఉండాలని వారు సూచించారు.వినాయక నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా చిన్నారుల పట్ల తల్లిదండ్రులు, నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. యువత ఐకమత్యంతో ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నిమజ్జనం ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా పోలీస్‌ శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో వివిధ వార్డులకు చెందిన కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు, వినాయక మండపం నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.