BREAKING
పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ఆసియా క్రీడల ప్రారంభోత్సవం వాతావరణ సవాళ్లకు భారత్ పరిష్కారాలు అందిస్తోంది: ప్రధాని నరేంద్ర మోదీ 51 వేల మందికి నియామక పత్రాలందించిన ప్రధాని మోదీ సెప్టెంబర్ 20న భారత్‌కు బిజీ షెడ్యూల్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనం నిర్మాణం కు ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర కృషి చేయాలి.... పలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. ఐఐటీ బాంబేలో విద్యార్థి బలవన్మరణం.. పరీక్షలో చాట్‌జీపీటీ వివాదం విదేశీ ఉద్యోగాల కోసం సువర్ణ అవకాశం దేశవ్యాప్తంగా నాలుగు హైకోర్టులకు 14 మంది నూతన న్యాయమూర్తుల నియామకం.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల సత్యదేవుని నిత్య అన్నదానానికి రూ లక్ష విరాళం బ్రిటన్‌లో సిక్కు బస్సు డ్రైవర్‌పై దుండగుడి దాడి.. వాహనం హైజాక్ చేసి బీభత్సం విగ్నేశ్వరస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి మహాకవి గురజాడ జయంతి రాష్ట్ర పండగే.. మరి జన్మభూమి ఎస్.రాయవరం సంగతేంటి? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే గర్వం, గుర్తింపు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

మహాకవి గురజాడ జయంతి రాష్ట్ర పండగే.. మరి జన్మభూమి ఎస్.రాయవరం సంగతేంటి?

Select Suryaa Now
మహాకవి గురజాడ జయంతి రాష్ట్ర పండగే.. మరి జన్మభూమి ఎస్.రాయవరం సంగతేంటి?

 

*హోం మంత్రి అనిత గారు స్పందించాలి!*

*ఎస్.రాయవరం, సెప్టెంబర్ 19, మేజర్ న్యూస్:*
మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతిని రాష్ట్ర పండగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం తెలుగు జాతి మొత్తం హర్షిస్తున్న విషయమే. కానీ ఆ ఆనందం ఎస్.రాయవరంలో మాత్రం అసంపూర్ణంగా మిగిలిపోయింది.

ఎందుకంటే, గురజాడ పుట్టిన జన్మభూమి ఎస్.రాయవరంలో నేటికీ ఒక్క అధికారిక వేడుక కూడా జరగడం లేదు.

మహాకవి 1862 సెప్టెంబర్ 21న పుట్టింది విజయనగరంలో కాదు... అనకాపల్లి జిల్లా, మన ఎస్.రాయవరంలోనే. అది చరిత్ర చెబుతున్న సత్యం. ప్రభుత్వ రికార్డుల్లో కూడా "Born at http://S.Rayavaram" అనే స్పష్టంగా ఉంది.

మరి వేడుకలు మాత్రం విజయనగరానికే పరిమితమా?

ఇది ఎస్.రాయవరం చరిత్రను విస్మరించడమే!

పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల ప్రశ్న ఒక్కటే...

> రాష్ట్ర పండగను జన్మస్థలంలో కాకుండా ఇంకెక్కడ జరుపుతారు?

*హోం మంత్రి వంగలపూడి అనిత గారికి విజ్ఞప్తి:*

ఈ నియోజకవర్గం బిడ్డగా, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, రాష్ట్ర హోం మంత్రిగా అనిత గారు చొరవ తీసుకోవాలని ఎస్.రాయవరం పౌరులు, సాహితీ ప్రియులు కోరుతున్నారు.

- *సెప్టెంబర్ 21న రాష్ట్ర స్థాయి అధికారిక జయంతి వేడుకను ఎస్.రాయవరంలోనే ప్రారంభించేలా ప్రభుత్వ ప్రకటన రావాలి.*
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించిన రాష్ట్ర పండగ GO ను, జన్మభూమి అయిన ఎస్.రాయవరం నుంచే అమలు చేయాలి.
- గురజాడ జన్మస్థలంలో స్మారక స్తూపం, గ్రంథాలయం ఏర్పాటు చేసి సాహిత్య పర్యాటకంగా అభివృద్ధి చేయాలి.

విజయనగరం గురజాడ కర్మభూమి అయితే, ఎస్.రాయవరం ఆయన *జన్మభూమి*. కర్మభూమిని గౌరవించిన ప్రభుత్వం, జన్మభూమిని విస్మరించడం భావ్యం కాదు.

హోం మంత్రి వంగలపూడి అనిత గారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి, ఈ ఏడాది నుంచే ఎస్.రాయవరంలో అధికారిక జయంతి నిర్వహించేలా ఉత్తర్వులు ఇప్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

*ఎస్.రాయవరం పౌరుల నినాదం ఒక్కటే: జయంతి వేడుక జన్మభూమి నుండే మొదలవ్వాలి!*