BREAKING
తల్లులు, పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడటానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి* గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలి శాఖల మధ్య సమన్వయంతో సకాలంలో భవనాల నిర్మాణం పూర్తి చేయాలి మంత్రి మంత్రి సీతక్క క్యూర్ ప‌రిధిలో 21వేల డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి ఈనెలాఖరులోగా ల‌బ్దిదారుల ఎంపిక పూర్తిచేయాలి దాదాపు 9వేల మందికి ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు క‌లెక్ట‌ర్ల‌తో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వీడియో కాన్ఫ‌రెన్స్ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణది కీలక పాత్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 24న జిల్లా సాఫ్ట్ బాల్ జూనియర్ జిల్లా ఎంపిక పోటీలు మద్యానికి డబ్బులు లేక రైలు కింద పడి వ్యక్తి మృతి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ఆసియా క్రీడల ప్రారంభోత్సవం వాతావరణ సవాళ్లకు భారత్ పరిష్కారాలు అందిస్తోంది: ప్రధాని నరేంద్ర మోదీ 51 వేల మందికి నియామక పత్రాలందించిన ప్రధాని మోదీ సెప్టెంబర్ 20న భారత్‌కు బిజీ షెడ్యూల్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనం నిర్మాణం కు ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర కృషి చేయాలి.... పలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. ఐఐటీ బాంబేలో విద్యార్థి బలవన్మరణం.. పరీక్షలో చాట్‌జీపీటీ వివాదం విదేశీ ఉద్యోగాల కోసం సువర్ణ అవకాశం

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది

Select Suryaa Now
పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది : జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజ నాయుడు*

- *: ఆత్మకూరులో ఘనంగా స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ*

అనంతపురం బ్యూరో 

ఆత్మకూరు మండలం, ఆత్మకూరు గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా హరిత ఆంధ్ర - శీతల ఆంధ్ర అనే థీమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజ నాయుడు, అనంతపురం డివిజనల్ పంచాయతీ అధికారి బి.శకుంతల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఉప మండల అభివృద్ధి అధికారి, మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రతి ఇంట్లో చెత్తను 4 రకాలుగా వేరు చేయాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మొక్కలు నాటడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ను హరిత ఆంధ్రగా, శీతల ఆంధ్రగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అలాగే SWPC షెడ్ పరిధి లో మొక్కలు నాటడం జరిగింది. మరియు చెత్త నుండి సంపద తయారీ కేంద్రం నందు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి విద్యార్థులకు తెలియజేసారు. పరిశుభ్రతే సేవ(స్వచ్ఛత హి సేవ) కార్యక్రమంలో లో భాగంగా SWPC షెడ్ నుంచి ఎంపిడిఓ కార్యాలయం ఆత్మకూరు వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం SWPC కార్యకలాపాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. కన్వేయర్ ద్వారా మిశ్రమ పొడి వ్యర్థాలను వేరు చేయడం, బేలింగ్ యంత్రం పనిచేయడం....ప్లాస్టిక్ వ్యర్థాలను నొక్కడం, ష్రెడ్డింగ్ యంత్రం ద్వారా ప్లాస్టిక్ పదార్థాన్ని చిన్న ముక్కలుగా చేయడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.