24న జిల్లా సాఫ్ట్ బాల్ జూనియర్ జిల్లా ఎంపిక పోటీలు
24న జిల్లా సాఫ్ట్ బాల్ జూనియర్ జిల్లా ఎంపిక పోటీలు
అనంతపురం బ్యూరో
ఉమ్మడి అనంతపురం జిల్లా సాఫ్ట్బాల్ జిల్లా జూనియర్ బాలురు మరియు బాలికల ఎంపికల పోటీలను ఈ నెల 24వ తేదీన నిర్వహిస్తున్నామని జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గాయత్రి గంగమ్మ తెలిపారు. పోటీలను ఉదయం 9 గంటల కు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఎంపికలను ఆర్డిటి క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంపికైన బాల బాలికల జట్లకు అక్టోబర్ 13 నుంచి 15 వరకు కడప జిల్లాలోని పుల్లంపేట లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో ప్రాతినిధ్యం వహించడం జరుగుతుందన్నారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు జనవరి 1 2009 తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. అదేవిధంగా క్రీడాకారులు తమ ఎస్ బీ ఏ ఐ నంబర్ ను తప్పనిసరిగా తీసుకురావాలని అన్నారు.