BREAKING
ఐఐటీ బాంబేలో విద్యార్థి బలవన్మరణం.. పరీక్షలో చాట్‌జీపీటీ వివాదం విదేశీ ఉద్యోగాల కోసం సువర్ణ అవకాశం దేశవ్యాప్తంగా నాలుగు హైకోర్టులకు 14 మంది నూతన న్యాయమూర్తుల నియామకం.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల సత్యదేవుని నిత్య అన్నదానానికి రూ లక్ష విరాళం బ్రిటన్‌లో సిక్కు బస్సు డ్రైవర్‌పై దుండగుడి దాడి.. వాహనం హైజాక్ చేసి బీభత్సం విగ్నేశ్వరస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి మహాకవి గురజాడ జయంతి రాష్ట్ర పండగే.. మరి జన్మభూమి ఎస్.రాయవరం సంగతేంటి? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే గర్వం, గుర్తింపు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వరకట్న వేధింపులతో బీటెక్ విద్యార్థిని మృతి ఈవీఎం గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా విశాఖలో టీ బోర్డ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రత్యేక టీ ప్రచార వేడుక ప్రారంభం 150 ఏళ్ల ఒంగోలు.. ఘన చరిత్రకు ఘన వేడుకలు! జలధార-జలహారతి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి- కలెక్టర్ రాజకుమారి గణియా AI యుగంలో నిరంతర అభ్యాసమే ఉద్యోగ భద్రతకు కీలకం: విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు: కలెక్టర్ జి. రాజకుమారి

వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

Select Suryaa Now
వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

.శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహించాలి..

..అధికారులకు సహకరించాలి: కలెక్టర్ బి. సత్యప్రసాద్..

 సూర్య మెట్‌పల్లి:-  

వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. భక్తులు, మండపాల నిర్వాహకులు అధికారులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
మెట్‌పల్లి పట్టణంలోని వాగు వద్ద వినాయక నిమజ్జనం కోసం మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక తదితర శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను శనివారం ఎస్పీ అశోక్ కుమార్‌ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో విగ్రహాలను శోభాయాత్రగా తరలించి నిమజ్జనం నిర్వహించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.నిమజ్జన ప్రాంతంలో విద్యుత్ దీపాలు, వైద్య సేవలు, అగ్నిమాపక సిబ్బంది, మత్స్యశాఖ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. పారిశుధ్య చర్యలు చేపట్టడంతో పాటు భారీ క్రేన్లు, చిన్న క్రేన్లు, గజ ఈతగాళ్లను అవసరమైన మేరకు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. భక్తులు, పిల్లలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు.వినాయక నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.