మండల పరిషత్ పాలక వర్గానికి సన్మానం
మండల పరిషత్ పాలక వర్గానికి ఘన సన్మానం
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
ఈ నెల 23వ తేదీన రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్ పాలక వర్గాలకు పదవి కాలం ముగుస్తుంది.. ఈ నేపథ్యంలో నందవరం మండల పరిషత్ పాలక వర్గం సమావేశం ముగిసిన అనంతరం జడ్పీటీసీ, నిఖిల్ తోపాటు ఎంపీపి లక్ష్మి దేవమ్మ ఎంపీటీసీ లను వైసీపీ నాయకులు శివారెడ్డి గౌడ్, లక్ష్మి కాంతరెడ్డి, వీరుపాక్షి రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, పేట శ్రీనివాస రెడ్డి లతో పాటు వివిధ గ్రామాల వైసీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. వైసీపీ పాలనలో మండలం అభివృద్ధి బాట పట్టిందన్నారు. జగనన్న కేటాయించిన నిధులతో మాజీ ఎం ఎల్ ఏ ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి నే తృత్వంలో అనేక పనులు చెయ్యడమే కాక సంక్షేమం అందించమన్నారు.