BREAKING
ప్రభుత్వ ఉద్యోగాలు, పరిశ్రమల ద్వారా యువతకు బంగారు భవిష్యత్తు: మంత్రి ఎస్.సవిత దొంగ దీక్షలు, ధర్నాలను ప్రజలు నమ్మరు* *వైసీపీ నాయకుల దీక్షలపై ఎమ్మెల్యే పరిటాల సునీత స్పందన* *వేపకుంటలో రూ.1.25కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం* మైహోం రామేశ్వరరావు భూముల కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు జనవరిలో తెనాలి వేదికగా నంది నాటకోత్సవాలు: మంత్రి కందుల దుర్గేష్ మండల పరిషత్ పాలక వర్గానికి సన్మానం ఆపరేషన్ అవసరం లేకుండానే లివర్ క్యాన్సర్ కు అధునాతన చికిత్స వినాయక మండపాలను సందర్శించిన ఆనంద గౌడ్ సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండండి పొలాలకు వెళ్లని వ్యవసాయ అధికారులు! రైతులకు అందని శాస్త్రీయ సాగు సూచనలు.. తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత - వ్యవసాయ రంగం ఆ తర్వాతేనని స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు నివాళులు అర్పించిన మిథున్ రెడ్డి *యూపీఐ చార్జీల నుంచి ఎరువులు, పురుగుమందులు, విత్తనాల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి గ్లోబల్ ఆడియెన్స్ కోసం నితీష్ తివారీ రామాయణ సరికొత్త ప్రయోగం - ఇంగ్లీష్ వెర్షన్‌లో సాంగ్స్ కట్, ముప్పై నిమిషాలు మదింపు

అర్బన్ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ని సత్కరించిన కార్మికులు*

Select Suryaa Now
అర్బన్ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ని సత్కరించిన కార్మికులు*

థ్యాంక్యూ ఎమ్మెల్యే దగ్గుపాటి 

*పారిశుధ్య కార్మికుల పండగ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 

*ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన సీఐటీయూ మున్సిపల్ కార్మికులు

*30మంది కార్మిక కుటుంబాలకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు*

*అర్బన్ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ని సత్కరించిన కార్మికులు

 

అనంతపురం బ్యూరో 

     గత 3సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న పోరాటం ఫలించింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి చొరవతో నగరపాలక సంస్థలో 30మంది కార్మికులకు ఉద్యోగాలు లభించాయి. ఈ నేపథ్యంలో అనంతపురం నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. గత కొన్ని నెలలుగా మున్సిపల్ కార్మికుల హక్కుల కోసం, వారి కుటుంబాల భద్రత కోసం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు అనేక పోరాటాలు నిర్వహిస్తున్నారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు, పదవీ విరమణ చేసిన కార్మికుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కార్మికుల ప్రధాన డిమాండ్లపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ప్రత్యేక చొరవ చూపారు. ఇటీవల చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో 12మందికి పదవీ విరమణ చెందిన కుటుంబాల్లో 18మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించారు. దీనిపై సీఐటీయూ మున్సిపల్ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ 30 నుండి 40 ఏళ్ల పాటు మున్సిపల్ కార్మికులుగా సేవలందించి, పదవీ విరమణ చేసిన తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక రోడ్డున పడుతున్న కుటుంబాలను కాపాడాలని, అలాగే విధి నిర్వహణలో ఉంటూ మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని చాలా కాలంగా పోరాటం చేస్తున్నామన్నారు. దీనిపై స్పందించినందుకు ఎమ్మెల్యే, ప్రత్యేక అధికారి, కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం కాంట్రాక్టు ప్రాతిపదికన నియమితులైన కార్మికులను భవిష్యత్తులో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. అలాగే, అనంతపురం నగర జనాభా, విస్తీర్ణానికి అనుగుణంగా పని భారాన్ని తగ్గించేందుకు, నగరంలో పనికి తగిన విధంగా అదనపు మున్సిపల్ కార్మికులను నియమించాలని వారు విజ్ఞప్తి చేశారు.  ఈ కార్యక్రమంలో సిఐటియు నగర నాయకులు, కార్మికులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.