BREAKING
*రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు* ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకం: సీపీ గౌస్‌ ఆలం..! ప్రభుత్వ ఉద్యోగాలు, పరిశ్రమల ద్వారా యువతకు బంగారు భవిష్యత్తు: మంత్రి ఎస్.సవిత దొంగ దీక్షలు, ధర్నాలను ప్రజలు నమ్మరు* *వైసీపీ నాయకుల దీక్షలపై ఎమ్మెల్యే పరిటాల సునీత స్పందన* *వేపకుంటలో రూ.1.25కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం* మైహోం రామేశ్వరరావు భూముల కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు జనవరిలో తెనాలి వేదికగా నంది నాటకోత్సవాలు: మంత్రి కందుల దుర్గేష్ మండల పరిషత్ పాలక వర్గానికి సన్మానం ఆపరేషన్ అవసరం లేకుండానే లివర్ క్యాన్సర్ కు అధునాతన చికిత్స వినాయక మండపాలను సందర్శించిన ఆనంద గౌడ్ సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండండి పొలాలకు వెళ్లని వ్యవసాయ అధికారులు! రైతులకు అందని శాస్త్రీయ సాగు సూచనలు.. తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత - వ్యవసాయ రంగం ఆ తర్వాతేనని స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు నివాళులు అర్పించిన మిథున్ రెడ్డి

*యూపీఐ చార్జీల నుంచి ఎరువులు, పురుగుమందులు, విత్తనాల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి

Select Suryaa Now
*యూపీఐ చార్జీల నుంచి ఎరువులు, పురుగుమందులు, విత్తనాల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి

ది తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్,డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు*

హనుమకొండ , సెప్టెంబర్ 18, మేజర్ న్యూస్ సూర్య

రైతులకు అవసరమైన ఎరువులు,పురుగుమందులు, విత్తనాల విక్రయాలపై ఆధారపడి వ్యాపారం నిర్వహిస్తున్న డీలర్లకు యూపీఐ లావాదేవీలకు సంబంధించిన చార్జీల నుంచి మినహాయింపు కల్పించాలని *తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్, డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోందని,వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలోనూ రైతులు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఎరువులు,పురుగుమందులు, విత్తనాల విక్రయాల్లో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో డీలర్లపై అదనపు లావాదేవీ వ్యయాలు పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్‌పుట్స్‌ను సకాలంలో అందించడంలో డీలర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యాపార లావాదేవీలను ప్రోత్సహించే విధంగా ఎరువులు,పురుగుమందులు, విత్తనాల విక్రయాలకు సంబంధించిన యూపీఐ చెల్లింపులపై డీలర్లకు ప్రత్యేక మినహాయింపు లేదా రాయితీ విధానం అమలు చేయాలని కోరారు.డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిశీలించి,బ్యాంకులు, డిజిటల్ చెల్లింపు సంస్థలతో సమన్వయం చేసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని నాగుర్ల వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించడంతో పాటు డీలర్లపై అనవసరమైన అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని ఆయన కోరారు.