BREAKING
గీతంలో ఘనంగా అంతర్జాతీయ హౌస్ కీపింగ్ వారోత్సవాలు ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం మంత్రి దామోదర్ రాజా నరసింహ స్వచ్ఛతే మన బాధ్యత – పరిశుభ్రతే మన గుర్తింపు* తిరుమల శ్రీవారి భక్తులకు డిసెంబర్ నెల దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది గిరిజన గ్రామాలలో సమస్యలను పరిష్కరించండి దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ​గన్ పార్క్ అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా చారిత్రక ఫొటోను ఉపరాష్ట్రపతి సి పి రాదక్రిష్ణకు వివరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు సైబర్ నేరగాళ్ల ఇద్దరు అరెస్ట్ .. రూ.25 లక్షల నగదు స్వాధీనం- ఎస్పీ సునీల్ షోరాన్ ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నాటరాజన్‌తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ తదితరులు హాజరు ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని విశ్వ సంరక్షక మహా గణపతి హోమం ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు.. నిపుణుల కీలక సూచనలు

స్వచ్ఛతే మన బాధ్యత – పరిశుభ్రతే మన గుర్తింపు*

Select Suryaa Now
స్వచ్ఛతే మన బాధ్యత – పరిశుభ్రతే మన గుర్తింపు*

 

*స్వచ్ఛతే మన బాధ్యత – పరిశుభ్రతే మన గుర్తింపు*

- *: నగరంలో నిర్వహించిన స్వచ్ఛత హి సేవ - 2026 ర్యాలీలో పాల్గొన్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని క్లాక్ టవర్ వద్ద నుంచి గురువారం నిర్వహించిన స్వచ్ఛత హి సేవ - 2026 ర్యాలీలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛత హి సేవపై మానవహారం నిర్వహించి, అనంతరం క్లాక్ టవర్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ స్వచ్ఛత హి సేవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం అని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, పరిశుభ్రత ప్రాముఖ్యతను తమ పిల్లలకు కూడా నేర్పించాలన్నారు. మన ఇల్లు, మన వీధి, మన గ్రామం, మన నగరం పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణమవుతుందన్నారు. పరిశుభ్రతను ఒక అలవాటుగా మార్చుకుందాం.. మన అనంతపురానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకువద్దాం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు, స్థానిక కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు, పాఠశాల విద్యార్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.