BREAKING
స్వచ్ఛ అనంతపురం జిల్లాగా తీర్చిదిద్దేందుకు బల్క్ వేస్ట్ జనరేటర్లు సహకరించాలి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ప్రైవేట్ హాస్టళ్ల నిర్లక్ష్యం విద్యార్థిని బలి… ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరించండి పెనకచర్ల డ్యామ్ కు నీటిని విడుదల చేయాలి పోలవరం ప్రాజెక్ట్ పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి ‘నిమ్మల’ కేజీబీవీ మోడల్ స్కూల్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ వైష్ణవి హత్య కేసులో నిందితుడైన హరిబాబు హతం… నిజామాబాద్‌లో దారుణ హత్య… ముస్లిం మైనార్టీ సమస్యల పరిష్కారానికి కృషి … ఆయా షేర్ సాంగ్ వచ్చాక లక్ష జడలు అమ్మారు: నేచురల్ స్టార్ నాని విజయ్ దేవరకొండ రణబాలి మూవీ షూటింగ్ పూర్తి.. అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్ రోగి భద్రతకు పెద్దపీట.: కేర్, ఆస్టర్ ఆసుపత్రుల్లో అవగాహన కార్యక్రమాలు దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార మూవీ రిలీజ్ డేట్ ఖరారు ప్రధాని మోదీకి మెగా హీరో రామ్‌చరణ్ బర్త్‌డే విషెస్‌.. కీలక ప్రకటనతో అభినందనలు టీజీపీసీబీలో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం లకుడారం కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నిక

వైష్ణవి హత్య కేసులో నిందితుడైన హరిబాబు హతం… నిజామాబాద్‌లో దారుణ హత్య…

Select Suryaa Now
వైష్ణవి హత్య కేసులో నిందితుడైన హరిబాబు హతం…  నిజామాబాద్‌లో దారుణ హత్య…
 సూర్య కోరుట్ల:
 
నిజామాబాద్ రాజా రాజేంద్ర చౌరస్తాలో కోరుట్లకు చెందిన హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం మేరకు కారులో వచ్చిన పలువురు వ్యక్తులు కొబ్బరి బొండాలు కొట్టే కత్తులతో హరిబాబుపై దాడి చేసి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఐదు నెలల క్రితం తన భార్య, యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో హరిబాబు నిందితుడిగా ఉన్నాడని, ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చినట్లు తెలిసింది. బెయిల్‌పై విడుదలైన కొద్దికాలానికే అతడు హత్యకు గురికావడం కలకలం రేపింది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తూ, వారి కోసం గాలింపు చేపట్టారు.