ముస్లిం మైనార్టీ సమస్యల పరిష్కారానికి కృషి …
ముస్లిం మైనార్టీ సమస్యల పరిష్కారానికి కృషి …
ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనార్టీల సంక్షేమ కమిటీ బృందం వెల్లడి.
రాష్ట్రంలోని ముస్లిం క్రిస్టియన్ తదితర మైనార్టీ ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనార్టీల సంక్షేమ కమిటీ కృషి చేస్తుందని చైర్మన్ మహమ్మద్ నాసిర్ అహ్మద్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో ఉమ్మడి జిల్లాల నుండి వచ్చిన మైనారిటీ ప్రజల నుండి వివిధ సమస్యలతో కూడిన వినితులను కమిటీ బృందం స్వీకరించింది. వినతుల స్వీకరణ అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ సమావేశంలో కమిటీ చైర్మన్ ముహమ్మద్ నాసిర్ అహ్మద్ ఈ సందర్భంగా పాత్రికేయులతోమాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ముస్లిం మైనార్టీల స్థితిగతులపై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి ప్రభుత్వపరంగా సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనారిటీ ల సంక్షేమం కమిటీ అధికారికంగా ఏర్పాటు అయిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కమిటీ పర్యటించి ముస్లిం మైనారిటీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే విధంగా కృషి చేస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వారి ప్రత్యేక చొరవతో జిల్లాలో రెండు రోజులపాటు కమిటీ బృందం పర్యటించి వివిధ సమస్యలను గుర్తించడం జరుగుతుందన్నారు. స్వీకరించిన సమస్యలను జిల్లా కలెక్టర్ తో సమీక్ష సమావేశం నిర్వహించి తదుపరి ప్రభుత్వానికి ఆయా సమస్యల పరిష్కారానికి నివేదిస్తామని చైర్మన్ స్పష్టం చేశారు.
నేటి ఉదయం అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో మైనార్టీ విద్యార్థులకు 4 శాతం రిజర్వేషన్ అమలు తీరు , మైనార్టీల ఉన్నత విద్యలో ప్రవేశ వివరాలు అలాగే హాస్టల్ వసతుల కల్పన ఇతర విద్యాభివృద్ధి సంబంధిత అంశాలపై యూనివర్సిటీ ఛాన్స్లర్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించడం జరిగిందన్నారు. అలాగే విద్యార్థిని విద్యార్థుల ద్వారా సమస్యలను తెలుసుకోవడం జరిగిందని మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు తదితర సమస్యలు చర్యలు అవసరమని తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ముఖ్యంగా బిప్రభుత్వం నుండి అర్హులకు అందాల్సిన ప్రభుత్వ పథకాల లబ్ధి కళాశాలలో పాఠశాలలో విశ్వవిద్యాలయాల్లో ముస్లిం మైనార్టీల విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై కమిటీ ప్రత్యేక దృష్టిని సారించిందన్నారు. అలాగే విద్యార్థుల కు ఉపకార వేతనాల మంజూరు విశ్వవిద్యాలయంలో రానున్న అటల్ బిహారీ మిషన్ అమలు అంశాల గురించి చర్చించడం జరిగింది అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మైనార్టీ విద్యార్థుల కొరకు ఏడెకరాల భూమిలో హాస్టల్ నిర్మాణానికి సంబంధించి సుమారు రూ.40 కోట్లతో హాస్టల్ వసతి కొరకు ప్రధానమంత్రి జన వికాస్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. ఈ విషయంలో కమిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా హాస్టల్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటుందని చైర్మన్ తెలిపారు. వక్ఫ్ ఆస్తుల కుచట్టపరమైన రక్షణ తో పాటు మసీదు, చర్చిలకు సంబంధించిన భూ వినియోగ ధ్రువీకరణ పత్రం రెవెన్యూ శాఖ ద్వారా మంజూరుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పేద మైనార్టీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపాధి అవకాశాలు కల్పించడానికి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అమలు చేయడానికి రాజకీయాలకు అతీతంగా ఆయా సమస్యలను ప్రభుత్వానికి కమిటీ ద్వారా నివేదిస్తుందన్నారు. గార్లదిన్నె, గుంతకల్లు, కదిరి ప్రాంతంలోని విద్యార్థులకు సంబంధించిన అంశాలను పరిశీలించి ఆయా సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని చైర్మన్ తెలిపారు.
అంతకుముందు స్థానిక అర్బన్ ఎమ్మెల్యే మరియు కమిటీ మెంబర్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో మైనార్టీ విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక డిగ్రీ కాలేజీ స్థాపన అలాగే అసెంబ్లీ కమిటీలో సమీక్షించి మైనార్టీ డిగ్రీ మరియు ఇంటర్ కాలేజీల ఏర్పాటు హాస్టల్లో అలాగే ఖాళీ గా ఉన్న ఆయా హోదాల్లో ఉద్యోగుల నియామకం తదితర అంశాలతో కూడిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా పారదర్శకత తో ముస్లిం మైనార్టీ సమాజ అభివృద్ధికి సంక్షేమానికి ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మాలోలా, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ రామ సుబ్బారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ ఈ.డీ. వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్లు రెహమాన్, గౌస్ లతో పాటు మైనార్టీ నాయకులు ఫిరోజ్ అహ్మద్, ఇస్మాయిల్ ,ఇషాక్ ,నియాజ్, స్వామి దాస్, ముస్లిం మత పెద్దలు వివిధ ముస్లిం మైనార్టీ సంఘాలు పలు రాజకీయ నాయకుల ప్రతినిధుల బృందం తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులను కలిసి వివిధ సమస్యలతో కూడిన వినతులను అందజేసిన ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ సంఘాలు మరియు పలు రాజకీయ పార్టీల ప్రతినిధులప్రతినిధుల వివరాలు ఇలా ఉన్నాయి.