BREAKING
స్వచ్ఛ అనంతపురం జిల్లాగా తీర్చిదిద్దేందుకు బల్క్ వేస్ట్ జనరేటర్లు సహకరించాలి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ప్రైవేట్ హాస్టళ్ల నిర్లక్ష్యం విద్యార్థిని బలి… ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరించండి పెనకచర్ల డ్యామ్ కు నీటిని విడుదల చేయాలి పోలవరం ప్రాజెక్ట్ పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి ‘నిమ్మల’ కేజీబీవీ మోడల్ స్కూల్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ వైష్ణవి హత్య కేసులో నిందితుడైన హరిబాబు హతం… నిజామాబాద్‌లో దారుణ హత్య… ముస్లిం మైనార్టీ సమస్యల పరిష్కారానికి కృషి … ఆయా షేర్ సాంగ్ వచ్చాక లక్ష జడలు అమ్మారు: నేచురల్ స్టార్ నాని విజయ్ దేవరకొండ రణబాలి మూవీ షూటింగ్ పూర్తి.. అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్ రోగి భద్రతకు పెద్దపీట.: కేర్, ఆస్టర్ ఆసుపత్రుల్లో అవగాహన కార్యక్రమాలు దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార మూవీ రిలీజ్ డేట్ ఖరారు ప్రధాని మోదీకి మెగా హీరో రామ్‌చరణ్ బర్త్‌డే విషెస్‌.. కీలక ప్రకటనతో అభినందనలు టీజీపీసీబీలో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం లకుడారం కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నిక

పోలవరం ప్రాజెక్ట్ పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి ‘నిమ్మల’

Select Suryaa Now
పోలవరం ప్రాజెక్ట్ పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి ‘నిమ్మల’

-- గొడ్డల పార్టీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఒక్క రూపాయి నిర్వాసితులకు ఇవ్వలేదు, ఒక్క ఎకరం భూమి ప్రాజెక్టుకు సేకరించలేదని ధ్వజం                   ఏలూరు, ఉమ్మడి ప.గో.జిల్లా సూర్య బ్యూరో :

ఈసిఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతి ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గురువారం మంత్రి పోలవరం ప్రాజెక్టు సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈసిఆర్ఎఫ్ డ్యామ్ కు సంబందించి గ్యాప్-1 నిర్మాణ పనులు 49 శాతం, గ్యాప్-2 పనులు 43 శాతం పూర్తి చేశాం.రైట్ కనెక్టివిటీస్ పనులు ఈ నెలాఖరు నాటికి, లెఫ్ట్ కనెక్టివిటీస్ పనులు నవంబర్ నాటికి పూర్తి కానున్నాయని వివరించారు.ఈసిఆర్ఎఫ్ డ్యామ్ పనులు 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యం పెట్టారు.రూ.536 కోట్లతో చేపట్టిన కుడి,ఎడమ గట్ల అనుసంధాన పనులు జరుగుతున్నాయి.2024 జూన్ తరువాత 10,491 ఎకరాల భూసేకరణ చేసి, నిర్వాసితులకు 2,250 కోట్ల పరిహారాన్ని అందించాం.గత 5 ఏళ్ళ పాలనలో ఒక్క ఎకరం భూమి సేకరించలేదు, నిర్వాసితులకు ఒక్కరూపాయి పరిహారం అందించలేద అని మంత్రి ధ్వజమెత్తారు.కేంద్రం ఇచ్చిన 3,850 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ నిధులును సైతం ప్రాజెక్టుకు గానీ, నిర్వాసితులకు గానీ ఖర్చుచేయకుండా దారిమళ్ళించారు.కూటమి ప్రభుత్వం ముందుగా చెప్పినట్లే హంద్రీనీవా, వెలిగొండ, పోలవరం ఎడమ కాలువలను పూర్తి చేసి నీళ్లు విడుదల చేసి దశాబ్దాల కల నెరవేర్చాం.రానున్న 3 ఏళ్లలో 35 వేల కోట్లు ఖర్చు చేసి 36 ప్రాజెక్టులు పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్యం పెట్టారు.వచ్చే 3 ఏళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల పండుగలను తీసుకొస్తాం.దశాబ్దాల కలల ప్రాజెక్టులను పూర్తి చేసి అపర భగీరధుడు చంద్రబాబు, వాటర్ మ్యాన్ గా గుర్తింపు పొందారు.గత 5 ఏళ్ళ లో ఇరిగేషన్ రంగాన్ని విధ్వంసం చేసి, రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసి, దుష్ట పాలకుడిగా గొడ్డలి పార్టీ నాయకుడు మిగిలిపోయాడని మంత్రి విమర్శించారు

గత ప్రభుత్వం లో గొడ్డలి పార్టీ నాయకుడు, వాళ్ళ మంత్రులు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం అంటూ ప్రశ్నార్ధకం చేశారని, 

నేడు పోలవరం పూర్తవుతుంది అనే భరోసాను, నమ్మకాన్ని చంద్రబాబు  ప్రజలకు కల్పించారని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.