స్వచ్ఛ అనంతపురం జిల్లాగా తీర్చిదిద్దేందుకు బల్క్ వేస్ట్ జనరేటర్లు సహకరించాలి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్
స్వచ్ఛ అనంతపురం జిల్లాగా తీర్చిదిద్దేందుకు బల్క్ వేస్ట్ జనరేటర్లు సహకరించాలి
జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్
అనంతపురం బ్యూరో, సెప్టెంబర్ 17:-
అనంతపురం జిల్లాను చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు బల్క్ వేస్ట్ జనరేటర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు.
గురువారం జిల్లా పరిషత్ సమావేశ భవనంలో బల్క్ వేస్ట్ జనరేటర్లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ.... అనంతపురం జిల్లాను చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు బల్క్ వేస్ట్ జనరేటర్లు గ్రామ పంచాయితీ అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. చెత్త ఎక్కువగా ఏర్పడే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్ లు, హాస్టల్ లు, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్లో కళ్యాణ మండపాలు వ్యవసాయ మార్కెట్లు నుంచి వచ్చే చెత్తను బల్క్ వేస్ట్ జనరేటర్లు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం చెత్త ఏర్పడే చోటునే పొడి, తడి చెత్తను వేరు చేసి చెత్త సేకరణ వాహనాలకు అందించేలా చూడాలన్నారు. అదేవిధంగా వారి వారి సంస్థల లోనే తడి చెత్తను కంపోస్ట్ గా మార్చడం లేదా బయోగ్యాస్ తయారీ వంటి చర్యలు చేపట్టాలి. పొడి చెత్తను స్వచ్ఛ రథాలకు అందజేసి నిత్యావసరాలు పొంది రీసైక్లింగ్ కు తోడ్పడాలి. ఈ విధంగా బల్క్ వేస్ట్ జనరేటర్లు గ్రామపంచాయతీలకుj సహకరించి, ఎస్ డబ్ల్యూ ఎం రూల్స్ ని తప్పనిసరిగా పాటించాలి. లేనియెడల వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే ప్రతి గ్రామపంచాయతీ అధికారి తమ పరిధిలోని బల్క్ వేస్ట్ జనరేటర్స్ ను గుర్తించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పగడ్బందీగా నిర్వహించేటట్లు చూడాలన్నారు.
పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి బల్క్ వేస్ట్ జనరేటర్ లను సంప్రదించి వారికి ఎస్ డబ్ల్యూ ఎం రూల్స్-2026 గురించి వివరించాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామం, సుస్థిర గ్రామం, అభివృద్ధి గ్రామంగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి పరిశుభ్రమైన వార్డులు పరిశుభ్రమైన గ్రామాలుగా అభివృద్ధి చేయాలన్నారు. రాబోయే రోజులలో వార్డులు, గ్రామాలను చెత్త రహిత గ్రామం, వార్డులుగా తీర్చిదిద్దాలన్నారు. ఇందుకు సంబంధించి ఎంపీడీవోలు పారిశుద్ధంపై పారిశుధ్య కార్మికులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు.