BREAKING
ఎపీ గవర్నర్ తిరుమల లో స్వాగతం వ్యక్తిపై దాడి స్వచ్ఛ అనంతపురం జిల్లాగా తీర్చిదిద్దేందుకు బల్క్ వేస్ట్ జనరేటర్లు సహకరించాలి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ప్రైవేట్ హాస్టళ్ల నిర్లక్ష్యం విద్యార్థిని బలి… ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరించండి పెనకచర్ల డ్యామ్ కు నీటిని విడుదల చేయాలి పోలవరం ప్రాజెక్ట్ పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి ‘నిమ్మల’ కేజీబీవీ మోడల్ స్కూల్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ వైష్ణవి హత్య కేసులో నిందితుడైన హరిబాబు హతం… నిజామాబాద్‌లో దారుణ హత్య… ముస్లిం మైనార్టీ సమస్యల పరిష్కారానికి కృషి … ఆయా షేర్ సాంగ్ వచ్చాక లక్ష జడలు అమ్మారు: నేచురల్ స్టార్ నాని విజయ్ దేవరకొండ రణబాలి మూవీ షూటింగ్ పూర్తి.. అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్ రోగి భద్రతకు పెద్దపీట.: కేర్, ఆస్టర్ ఆసుపత్రుల్లో అవగాహన కార్యక్రమాలు దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార మూవీ రిలీజ్ డేట్ ఖరారు ప్రధాని మోదీకి మెగా హీరో రామ్‌చరణ్ బర్త్‌డే విషెస్‌.. కీలక ప్రకటనతో అభినందనలు

పెనకచర్ల డ్యామ్ కు నీటిని విడుదల చేయాలి

Select Suryaa Now
పెనకచర్ల డ్యామ్ కు నీటిని విడుదల చేయాలి

*ఎల్‌నినో – కరువు నుంచి రైతులను కాపాడాలి*

*పెనకచెర్ల డ్యామ్‌కు నీరు వదలాలి!* 

*పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి:__ సీపీఐ(యమ్ యల్) లిబరేషన్

 

అనంతపురం బ్యూరో, 

   ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తీవ్రతరం కావడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో సీపీఐ(యమ్ యల్ ) లిబరేషన్ పార్టీ అనంతపురం జిల్లా బృందం ఈరోజు గార్లదిన్నె, మర్తాడు, కోటంక, పెనకచెర్ల, పెనకచెర్ల డ్యామ్, పామిడి మండలాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టింది.

ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో రైతులను కలిసి పంటల పరిస్థితిని, సాగు సమస్యలను పార్టీ బృందం పరిశీలించింది. ముఖ్యంగా చీనీ (బత్తాయి), వేరుశనగ, మొక్కజొన్న పంటలు ఎల్‌నినో ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలకు అవసరమైన తేమ అందక దిగుబడులు గణనీయంగా తగ్గే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

సాగు కోసం విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చుల రూపంలో పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అప్పులు చేసి సాగు చేసిన రైతులకు పంట నష్టం మరింత భారంగా మారింది.

*ముఖ్యంగా సిపిఐ (యమ్ యల్)  లిబరేషన్ పార్టీ బృందం పెనకచెర్ల డ్యామ్ ను సందర్శించడం జరిగింది డ్యామ్ పరిస్థితి చాలా దయనీయ పరిస్థితులలో ఉంది అక్కడ నీళ్లు 12 అడుగులు మాత్రమే ఉండడం చాలా బాధకరం కాబట్టి జిల్లా అధికారులు జిల్లా ఎమ్మెల్యే ఎంపీలు తక్షణమే ప్రభుత్వంతో మాట్లాడి డ్యామ్ కు కనీసం ఐదు టీఎంసీలు నీరు విడుదల ఏ విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడం జరిగింది.*

ఈ సందర్భంగా సీపీఐ(యమ్ యల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వేమన  మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి రైతులను కరువు నుంచి కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన చీనీ, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటల రైతులకు తగిన పరిహారం అందించాలని కోరింది.

అనంతపురం జిల్లాను కరువు జిల్లా గా   ప్రకటించాలని, రైతులకు పంట నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ, సాగునీరు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని , రైతులు చేసిన అప్పులను రద్దు చెయ్యాలి అని పేర్కొన్నారు.7

ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. కరువు పరిస్థితులపై తక్షణమే సమగ్ర కార్యాచరణ ప్రకటించి రైతాంగానికి భరోసా కల్పించాలి.

*ఈ కార్యక్రమంలో సిపిఐ (యమ్ యల్) లిబరేషన్ పార్టీ జిల్లా కమిటి సభ్యులు పరుశురాముడు బాలకృష్ణ, సుజాతమ్మ, యమన్న తదితరులు పాల్గొన్నారు.*