BREAKING
ఎపీ గవర్నర్ తిరుమల లో స్వాగతం వ్యక్తిపై దాడి స్వచ్ఛ అనంతపురం జిల్లాగా తీర్చిదిద్దేందుకు బల్క్ వేస్ట్ జనరేటర్లు సహకరించాలి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ప్రైవేట్ హాస్టళ్ల నిర్లక్ష్యం విద్యార్థిని బలి… ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరించండి పెనకచర్ల డ్యామ్ కు నీటిని విడుదల చేయాలి పోలవరం ప్రాజెక్ట్ పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి ‘నిమ్మల’ కేజీబీవీ మోడల్ స్కూల్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ వైష్ణవి హత్య కేసులో నిందితుడైన హరిబాబు హతం… నిజామాబాద్‌లో దారుణ హత్య… ముస్లిం మైనార్టీ సమస్యల పరిష్కారానికి కృషి … ఆయా షేర్ సాంగ్ వచ్చాక లక్ష జడలు అమ్మారు: నేచురల్ స్టార్ నాని విజయ్ దేవరకొండ రణబాలి మూవీ షూటింగ్ పూర్తి.. అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్ రోగి భద్రతకు పెద్దపీట.: కేర్, ఆస్టర్ ఆసుపత్రుల్లో అవగాహన కార్యక్రమాలు దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార మూవీ రిలీజ్ డేట్ ఖరారు ప్రధాని మోదీకి మెగా హీరో రామ్‌చరణ్ బర్త్‌డే విషెస్‌.. కీలక ప్రకటనతో అభినందనలు

ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరించండి

Select Suryaa Now
ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరించండి

ముస్లిం మైనార్టీ సమస్యలను పరిష్కరించండి…

ఆల్ మేవా వినతి 

అనంతపురం బ్యూరో, సెప్టెంబర్17:

ముస్లిం మైనార్టీల సంక్షేమ అభివృద్ధి కోసం ఉమ్మడి జిల్లాలో నెలకొని ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనార్టీ సంక్షేమ కమిటీ బృందానికి ఆల్ మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు షేక్షావలి ఫక్రుద్దీన్ జిలాన్ దావూద్, మస్తాన్ తదితరులు వినతి పత్రం ద్వారా విన్నవించారు. 

ముఖ్యంగా ముస్లిం మైనార్టీల విద్యార్థుల కోసం జిల్లా కేంద్రంలో మైనార్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ప్రధానమంత్రి 15 సూత్రాల పథకాన్ని కచ్చితంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే జిల్లా కమిటీని ఏర్పాటు చేయాలని, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు నయి మంజీర కమావో తదితర పథకాలను పటిష్టంగా అమలు చేయాలని అలాగే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఉర్దూ ప్రాథమిక పాఠశాలలను మండలానికి ఒకటి చొప్పునఅప్పర్ ప్రైమరీ కి అప్గ్రేడ్ చేయాలని ముస్లిం మైనార్టీ విద్యార్థుల మదరసాల ఆధునికీకరణ మత్రసాలను ఆధునిక విద్యతో అనుసంధానించే పథకం రెండు జిల్లాల్లో అమలు చేయాలని ముస్లిం సమాజానికి జనాభా మరియు ఓటర్ల వాటా ప్రకారం ఎక్కువ రాజకీయ అవకాశాలు కల్పించాలని జనాభా ప్రతిపాదికన తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు పరిరక్షణ మరియు కొనసాగింపు తో పాటు దుల్హన్ పథకం కింద ఆర్థిక సాయం లక్షకు పెంచాలని హజ్ యాత్రకు సంబంధించి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వం ద్వారా మంజూరు చేయాలని మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాలు మంజూరు ప్రధాన పట్టణాల్లో ఈద్గా కవర్ స్టాండ్ మసీదులకు సరైన స్థలాల కేటాయింపు కొరకు చర్యలు తీసుకోవాలని ముస్లిం మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కోచింగ్ మరియు సమాజ అవగాహన కార్యక్రమాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలుకు చర్యలు తీసుకోవాలని , అర్హులైన క్రైస్తవులకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు, ముస్లిం క్రైస్తవ మైనార్టీల అభ్యున్నతికి రాజ్యాంగబద్ధమైన హక్కుల కల్పనలో సమానంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక బాలికల హాస్టల్ లో ప్రతి జిల్లాకు ఒక ఉర్దూ మోడల్ స్కూలు మంజూరు చేయాలని ఉర్దూ ఉపాధ్యాయులకు ప్రత్యేక డీఎస్సీ మరియు బ్యాగ్ లాక్ నియామక నిర్వహించాలని, క్రైస్తవ మైనారిటీల హక్కులు భద్రత మరియు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి 2024 సంవత్సరంలో మేనిఫెస్టో హామీలన్నింటిని స్పష్టమైన గడువులోగా అమలు తదితర అంశాలపై వినతిపత్రం సమర్పించారు.