కేజీబీవీ మోడల్ స్కూల్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్
కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్ పనులను పరిశీలించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
భారత ప్రభుత్వ పాఠశాల విద్య, లిటరసీ కార్యదర్శి మరియు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సెప్టెంబర్ 18వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు జగరాజుపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్ మరియు కేజీబీవీ పాఠశాలలను సందర్శించనున్నారు.ఈ నేపథ్యంలో, పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు మరియు ముందస్తు ఏర్పాట్లను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూళ్లలో జరుగుతున్న వివిధ పనులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన కలెక్టర్, అధికారులకు మరియు పాఠశాల ప్రిన్సిపాళ్లకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖ అధికారుల రాకను పురస్కరించుకుని ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కేజీబీవీ కార్యదర్శి దేవానందరెడ్డి, సమగ్ర శిక్ష అడిషనల్ ఎస్పీడీ రవీంద్రనాథ్ రెడ్డి, కడప పాఠశాల విద్య ఆర్జేడీ కే. శ్యాముల్, జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణప్ప తదితర అధికారులు పాల్గొన్నారు.