లకుడారం కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నిక
లకుడారం కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నిక
కుకునూరుపల్లి, .... సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల పరిధిలోని లకుడారం గ్రామంలోని గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందూరి ఐలయ్య లకుడారం కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కమిటీ ఏర్పాటు చేశారు.
అధ్యక్షులుగా మారపాక శివకుమార్, ఉపాధ్యక్షులుగా గూడెపు దయాకర్,MD ముస్తఫా,ప్రధాన కార్యదర్శిగా ఈగ కనకయ్య కార్యదర్శి మంజ స్వామి కోశాధికారి ఈగ నరసింహులు సలహాదారులు దూదేకుల బాబుమియా మెర్గోజీ కరుణాకర్ చారి కంకణాల కిష్టయ్య ను ఎన్నుకోగా
కాంగ్రెస్ పార్టీ గ్రామ అనుబంధ కమిటీలుగా గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా ఎర్ర రాజు
ఉపాధ్యక్షులు దేవి సర్వయ్య,బీసీ సెల్ గ్రామ అధ్యక్షులు దుద్దెడ పవన్ ఉపాధ్యక్షులు తలకొక్కుల సాగర్ మైనార్టీ అధ్యక్షునిగా గ్రామ అప్సర్ ఎన్నుకోవడం జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలతో సమన్వయంతో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. మండలంలోని అన్ని గ్రామ శాఖ కమిటీలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు.ఈకార్యక్రమంలో కంకణాల మల్లేశం మాజీ ఉపసర్పంచ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చలి అండాలమ్మ ఉమ్మడి కొండపాక మండల డైరెక్టర్ సుజాత మురళి పత్తిరి రాము బైండ్ల రవీందర్ కానుగుల చంద్రం మాజీ గ్రామ అధ్యక్షుడు మంజ చిన్న స్వామి చింతల చందు అశ్రప్ పైసా కనకయ్య పైస యాదయ్య ములుగు కరుణాకర్ ములుగు బాల్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు