ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకు వరం లాంటివి - టిపిసిసి ప్రధాన కార్యదర్శి
సూర్య- బిక్కనూర్ : ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకు వరం లాంటివని, టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. శుక్రవారం మండలంలోని రామేశ్వర్ పల్లి లో రెండవ విడత మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించి, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు,,ఉపసర్పంచ్ గొల్లపల్లి వినోద్ కుమార్ గౌడ్,, వార్డు సభ్యులు భవాని ధర్మస్వామి,మన్నె కళ్యాణి రవి, కూతురు రమేష్, పనాస రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కడారి నాగరాజు, పెద్ద రమేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్యామ్,లబ్ధిదారులు, మహిళలు,పెద్ద ఎత్తున పాల్గొన్నారు.