బో'నమో' దుర్గమ్మ
మద్దూరు.…మద్దూరు మండలంలోని లద్నూర్ గ్రామంలో బీరప్ప యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గమాతకు శుక్రవారం రాత్రి గ్రామంలోని మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించారు. ఒగ్గుడోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల మధ్య మహిళలు నెత్తిన ఎత్తుకొని ఊరేగింపుగా దుర్గామాత మండపం వరకు ఊరేగింపు వెళ్లి అమ్మవారికి బోనాలను నైవేద్యంగా సమర్పించారు. కార్యక్రమంలో యూత్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.