BREAKING
జనసేన అభ్యర్థిగా మహమ్మద్ ఆరిఫ్ జనసేన చైర్మన్ అభ్యర్థిగా దారం సుబ్బారావు. రెండో రోజు 17 నామినేషన్ లు. ఆయుష్ శాఖలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ • జిల్లా ఆయుష్ నోడల్ అధికారి 22వ వార్డు నుంచి వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన గేల్లా రేణిగుంటలో వైసీపీలోకి టీడీపీ సీనియర్ నాయకుడు చందానగర్ దుర్గాభవాని అమ్మవారికి రవికుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో గంగానమ్మ అమ్మవారు దర్శనం శేరిలింగంపల్లిలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు దుర్గామాత మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే గాంధీ ప్రజాసేవ కోసం అహర్నిశలు కృషి చేస్తా చందానగర్-అమీన్‌పూర్ రోడ్డు విస్తరణ పనుల పరిశీలన: ₹45 కోట్ల ప్రాజెక్టును వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆదేశం! మహాలక్ష్మీ అలంకారంలో శ్రీ వాసవీ అమ్మవారు.. లక్ష పుష్పార్చన అభ్యర్థుల ఖర్చులపై నిఘా.... అభ్యర్థులారా.. మీ వెంట నిఘా నేత్రాలు.... ఎన్నికల వ్యయ పరిమితి దాటితే చర్యలే... ర్యాలీలు, సభలు, ప్రచార వాహనాల ఖర్చులన్నీ పరిగణలోకి... నామినేషన్ల పర్వము నుండి ఫలితాలు వచ్చేవరకు అప్రమత్తత తప్పనిసరి... వైసీపీ చైర్ పర్సన్ అభ్యర్థి గా తంబిరెడ్డి రాజేశ్వరమ్మ నామినేషన్ దాఖలు స్వర్ణ గిరిలో స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం* హయత్‌నగర్‌లో శరన్నవరాత్రి వేడుకలు: అమ్మవారిని దర్శించుకున్న మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి.. భక్తులకు అన్నప్రసాద వితరణ!

వాడిన పత్తి పంటల పరిశీలన.. రైతులకు భరోసా!

Select Suryaa Now
వాడిన పత్తి పంటల పరిశీలన.. రైతులకు భరోసా!

చౌటుప్పల్‌, మేజర్ న్యూస్: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడి వాడిపోతున్న పత్తి పంటలను వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్‌, వ్యవసాయ కార్యదర్శి కే. సురేంద్రమోహన్‌ ఐఏఎస్‌ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఆరెగూడెంలో పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటల పరిస్థితి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీఓ) ద్వారా పంట ఉత్పత్తులను రైతులే కొనుగోలు చేసి, విక్రయించుకోవడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చన్నారు. వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ పంటను సాగు చేసి మెరుగైన ఆదాయం పొందే అవకాశాలను వివరించారు.

పత్తి రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, పంటల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె. హేమలత, మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, ఉద్యాన అధికారి కవిత, వ్యవసాయ విస్తరణ అధికారి వెన్నెల, ఎన్నపల్లి వెంకట్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ నిమ్మల సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు.