రేవంత్ రెడ్డికి ఏఐసీసీ వాలంటీర్స్ కమిటీ షోకాజ్ నోటీసులు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ఛాత్రోంకి గూంజ్" (విద్యార్థుల గళం) కార్యక్రమానికి మద్దతు ఇవ్వలేదనే కారణంతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్. రేవంత్ రెడ్డికి ఆల్ ఇండియా కాంగ్రెస్ వాలంటీర్స్ కమిటీ (AICVC) బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కార్యక్రమానికి ఎందుకు మద్దతు తెలపలేదో, హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని కోరుతూ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసులపై తక్షణమే స్పందించి, తగిన కారణాలను వివరిస్తూ 72 గంటల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని AICVC స్పష్టం చేసింది. కేవలం సీఎం రేవంత్ రెడ్డికి మాత్రమే కాకుండా పార్టీకి చెందిన పలువురు కీలక నేతలకు కూడా కమిటీ నోటీసులు పంపింది.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
కేరళ అసెంబ్లీ ప్రతిపక్ష నేత వి.డి. సతీషన్
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ
వీరందరూ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నిర్వహించిన విద్యార్థుల అవగాహన, సమస్యల పోరాట కార్యక్రమం "ఛాత్రోంకి గూంజ్"కు ఆశించిన స్థాయిలో మద్దతు ఇవ్వకపోవడంపై ఏఐసీసీ వాలంటీర్స్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ చర్యలు చేపట్టింది.