BREAKING
పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ

విజయవాడ ఉత్సవ్ 2.0 ప్రచారానికి రవాణా రంగం అండ.. - లారీ ఓనర్స్ అసోసియేషన్ల కృషికి ఎంపీ కేశినేని చిన్ని అభినందనలు

Select Suryaa Now
విజయవాడ ఉత్సవ్ 2.0 ప్రచారానికి రవాణా రంగం అండ.. - లారీ ఓనర్స్ అసోసియేషన్ల కృషికి ఎంపీ కేశినేని చిన్ని అభినందనలు

విజయవాడ, మేజర్ న్యూస్ : విజయవాడ ఉత్సవ్‌–2.0ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్లు చేస్తున్న ప్రచారాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అభినందించారు. ప్రతి రవాణా వాహనంపై ఉత్సవ్‌ ప్రచార స్టిక్కర్లు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవ్‌ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని స్వయంగా ఆర్టీసీ బస్సుపై విజయవాడ ఉత్సవ్‌–2.0 స్టిక్కర్‌ను అంటించారు. విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే ఉత్సవాన్ని విజయవంతం చేయడంలో రవాణా రంగంతో పాటు వ్యాపార, పారిశ్రామిక, విద్యా, సాంస్కృతిక రంగాలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవ్‌–2.0ను ప్రత్యేక సాంస్కృతిక ఉత్సవంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్, ఈశ్వరరావు, రాజా, రావి గోపాలరావు, పొట్లూరి సాయిబాబు, కొల్లి మురళి, యార్లగడ్డ సుందర్‌రావు, కోనేరు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.