వల్లూరులో.. అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు ధనలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన వాసవి మాత
వల్లూరు మేజర్ న్యూస్
మండల పరిధిలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం (అమ్మవారిశాల)లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం 3వ రోజు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం వాసవి మాత ధనలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలోని మూలవిరాట్టు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు సమర్పించారు. అనంతరం మహా మంగళహారతులు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ధనలక్ష్మి దేవి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి దర్శనంతో ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష అలంకరణలు, పూజలు నిర్వహించడం భక్తులను ఆకట్టుకుంది..
*రిపోర్టర్ రాఘవ - వల్లూరు కడప జిల్లా*