BREAKING
ప్రాణం పోయాక వస్తారా డాక్టర్లు...?! స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ తుఫాను ఢీ కొట్టిన ఎక్సైజ్ సీఐ గారు కరీంనగర్‌లో స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమానికి శ్రీకారం వెటర్నరీ డాక్టర్ నియామకానికి దేవాదాయ శాఖ అంగీకారం Sir పేరుతో అధికారులు మాయం.... కార్యాలయాలకు వచ్చి ప్రజలు విలవిల అఫ్గానిస్థాన్‌పై సిరీస్ విజయాన్ని ఖరారు చేసిన భారత్ భారత్-న్యూజిలాండ్ వాణిజ్య ఒప్పందానికి పార్లమెంట్ ఆమోదం మక్కా సమీపంలో హౌతీ డ్రోన్‌ను ధ్వంసం చేసిన సౌదీ సంకీర్ణ కూటమి ఫెడ్ నిర్ణయానికి ముందు ఆందోళనలో ఆసియా మార్కెట్లు 2029 నాటికి ‘స్వచ్ఛ యమున’ లక్ష్యం సాకారం: అమిత్ షా దీపావళి కానుకగా నయనతార ‘మహాశక్తి’ వరల్డ్ వైడ్ రిలీజ్! అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా సందీప్ కిషన్ ‘సిగ్మా’ గ్రాండ్ రిలీజ్! జీవిత సత్యాలు, ప్రశాంతత కోసం గౌతమ బుద్ధుడు బోధించిన మార్గం! హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవ కమిటీలకు షాక్: ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనాలకు అనుమతి నిరాకరణ!

తుఫాను ఢీ కొట్టిన ఎక్సైజ్ సీఐ గారు

Select Suryaa Now
తుఫాను ఢీ కొట్టిన ఎక్సైజ్ సీఐ గారు

తుఫాన్ వాహనాన్ని ఢీకొన్న ఎక్సైజ్ సీఐ కారు

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు

ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల సబ్ స్టేషన్ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎక్సైజ్ కారు ఎదురుగా ఉన్న తుఫాను బలంగా ఢీకొంది..  సీఐ మద్యం మత్తులో కారు నడిపి తూఫాన్ వాహనాన్ని ఢీకొట్టినట్లు బాధితులు ఆరోపించారు.
ప్రమాద సమయంలో కారు ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో సీఐ రమేష్‌కు ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితులు గోనెగండ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన బాధ్యతాయుతమైన అధికారే మద్యం సేవించి వాహనం నడిపినట్లు ఆరోపణలు రావడం ఆందోళన కలిగించే విషయమని బాధితులు పేర్కొన్నారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే సీఐ రమేష్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, విచారణ పూర్తయ్యే వరకు తక్షణమే విధుల నుంచి తప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు.