పైడికాలువలో ఘనంగా వినాయక చవితి.. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలి రైతులు సుభిక్షంగా ఉండాలి - పాడిపంటలు సమృద్ధిగా పండాలి పూజా కార్యక్రమంలో - ఆకుల శ్రీనివాసులు..
పైడికాలువలో ఘనంగా వినాయక చవితి..
ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలి
రైతులు సుభిక్షంగా ఉండాలి - పాడిపంటలు సమృద్ధిగా పండాలి
పూజా కార్యక్రమంలో - ఆకుల శ్రీనివాసులు..
వల్లూరు మేజర్ న్యూస్
మండల పరిధిలోని పైడికాలువ గ్రామంలో సోమవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి టీడీపీ నాయకులు ఆకుల శ్రీనివాసులు తన సతీమణితో కలిసి తొలి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ హరి నారాయణ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాసులు మాట్లాడుతూ వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా రైతులకు ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండాలని, పాడిపంటలు వృద్ధి చెందాలని, ప్రతి రైతు కుటుంబం సుభిక్షంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని, ప్రజలందరికీ విఘ్నాలు తొలగి అభివృద్ధి, ఆనందం కలగాలని కోరారు. అనంతరం ప్రధాన అర్చకులు శ్రీ హరి నారాయణ స్వామి మాట్లాడుతూ వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడని, భక్తిశ్రద్ధలతో గణనాథుడిని ఆరాధిస్తే శుభఫలితాలు కలుగుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి, శ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఐకమత్యంతో, సుఖశాంతులతో జీవించాలని, రైతులు సంతోషంగా ఉండేలా మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు. వినాయక చవితి వేడుకల ప్రారంభ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో పైడికాలువ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది..