ఏపీలో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్.. మార్గదర్శకాలతో జీవో జారీ!
ఆంధ్రప్రదేశ్‌లో 7.85 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
* ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పూర్తి
ఆంధ్రప్రదేశ్‌లో 7,85,500 ఎకరాల ఫ్రీహోల్డ్ భూములతో పాటు నిబంధనల ప్రకారం అర్హత కలిగిన భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతినిస్తూ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది. పూర్తి నిబంధనలు, వివరాలు తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీహోల్డ్ హక్కులు పొందిన 7.85 లక్షల ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అసైన్డ్ భూములుగా తప్పుగా నమోదైన ప్రైవేట్ పట్టా భూములు, చుక్కల భూములకు సైతం వెసులుబాటు కల్పిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమాలు జరిగిన భూములపై విచారణకు ఆదేశిస్తూ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.