భాజపాలో చేరికలు
బీజేపీలోకి భారీగా చేరికలు
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని భాజపా నాయకులు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్నారు ఇందులో భాగంగానే మంగళవారం స్థానిక బిజెపి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున మహిళలు భాజపా కండవ కప్పుకొని పార్టీలో చేరారు.. రాష్ట్ర పార్టీ సూచనల మేరకు మరియు కర్నూలు జిల్లా ఇన్చార్జి సంధి రెడ్డి శ్రీనివాసులు సూచనల మేరకు కర్నూలు జిల్లా భాజపా అధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణ ఆదేశాలతో కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి గురురాజ్ దేశాయ్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి..
బి.ఎల్. నారాయణ అధ్యక్షతన ఎమ్మిగనూరు పట్టణం 2వ వార్డ్
బి. సరస్వతి , 3 వార్డు ఎం. లక్ష్మి వారితో పాటుగా 60కి పైగా వారి వార్డ్ కుటుంబాలు బీజేపీలో చేరారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన, సంక్షేమ పథకాలు, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న విధానాలను మెచ్చి ఎమ్మిగనూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో 60 కుటుంబాలకు చెందిన మహిళలు బీజేపీలో చేరారు.
అనంతరం గురురాజ్ దేశాయ్ గారు మాట్లాడుచూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా… దేశ నిర్మాణంలో మహిళలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలనే సంకల్పంతో బీజేపీ కుటుంబంలో అడుగుపెట్టారన్నారు.
మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించే దిశగా మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలకు మద్దతుగా మహిళలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరడం విశేషం.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని బిజెపి అసెంబ్లి కార్యలయంలో నిరంతరం ప్రజల సమస్యలపట్ల పరిష్కారం కొరకు కృషిచేస్తూ ఎమ్మిగనూరు ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులొ ఉంటూ పార్టిలో చురుకుగా పాల్గొనుచూ బిజెపి అభివృద్దికి పాటుపడుచున్న గురురాజ్ దేశాయ్ మరియు ఇతరనాయకులు చేస్తున్న కృషికి మేమంతా బిజేపిలో చేరడం జరిగిందని శ్రీమతి బి. సరస్వతి గారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్ఎస్సి కాల్వ చైర్మన్ రామన్న గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు,ఉపాధ్యక్షులు ఎమ్మిగనూరు టౌన్ వెల్డింగ్ వెంకటేష్, కర్నూలు జిల్లా బీజేవైఎం కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు