BREAKING
వారణాసిలో రూ.10,998 కోట్లతో 'వరుణా ఎలివేటెడ్ కారిడార్' చమురు ధరల మంట, వడ్డీ రేట్ల భయాలు అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ సమపాళ్లలో సాగాలి అభివృద్ధి, సంక్షేమంలో నెల్లూరును రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలపాలి -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సంవత్సరి పర్వదినాన ప్రధాని మోదీ శుభాకాంక్షలు కోవూరుకు నారా లోకేష్‌ .. ఘనస్వాగతానికి సిద్ధమవుతున్న టీడీపీ శ్రేణులు - కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి చెరకు రైతులకు తీపి కబురు లడఖ్‌లో ఘనంగా 'హెచ్‌డిఎస్ఆర్ స్టార్ పార్టీ' బనవాసి నవోదయను పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు భారత్‌లో ఫార్ములా 1 రేసింగ్ పునరుద్ధరణ ఐటీ దిగ్గజం ఒరాకిల్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. తెల్లవారుజామునే టెర్మినేషన్ మెయిల్స్ ఆగస్టులో వాహన విక్రయాల జోరు సెమికాన్ ఇండియా 2026 రక్షణ రంగంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లకు ఊతం పిల్లల రక్షణే మా ప్రాధాన్యత

అభివృద్ధి, సంక్షేమంలో నెల్లూరును రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలపాలి -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

Select Suryaa Now
అభివృద్ధి, సంక్షేమంలో నెల్లూరును రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలపాలి                                                                                  -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

అభివృద్ధి, సంక్షేమంలో నెల్లూరును రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలపాలి
                                                                                 -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

నెల్లూరు, మేజర్ న్యూస్: నెల్లూరు, సెప్టెంబర్ 15: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు సమన్వయంతో, లక్ష్యసాధన దిశగా మరింత చురుగ్గా పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పిలుపునిచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ నూటికి నూరు శాతం అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మంగళవారం ఉదయం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన 8వ కలెక్టర్ల సదస్సులో జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై చర్చించిన అంశాలు, జిల్లాలో శాంతి భద్రతలు, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యలను వివరించారు.అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలు, ఇప్పటివరకు సాధించిన ప్రగతిని  కలెక్టర్‌ వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, సేవా రంగం, పరిశ్రమలు, గృహ నిర్మాణం, నీటిపారుదల, మున్సిపాలిటీలు, రహదారుల నిర్మాణం, విద్య, సంక్షేమం తదితర ప్రాధాన్యత రంగాల్లో పనితీరును మరింత మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.జిల్లాలో ఉత్తమ పనితీరు కనబరిచిన విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద 25 వేలకు పైగా విద్యుత్ కనెక్షన్లు అందించి రాష్ట్రంలో జిల్లాను ఉన్నత స్థానంలో నిలిపిన అధికారులను ఆయన అభినందించారు.అదేవిధంగా రామాయపట్నం పోర్టు అభివృద్ధి, బీపీసీఎల్ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియలో కీలకంగా పనిచేసిన రెవెన్యూ అధికారులను కూడా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో ప్రధానమంత్రి చేతుల మీదుగా బీపీసీఎల్ పరిశ్రమకు భూమిపూజ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటి నుంచే సమాయత్తమై సంబంధిత పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమ శాఖ పరిధిలో అమలవుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు నూటికి నూరు శాతం చేరేలా సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ప్రతి శాఖ పనితీరును మరింత మెరుగుపరచి రాష్ట్రంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్‌ఓ విజయ్ కుమార్, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు