బనవాసి నవోదయను పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు
వనవాసి నవోదయ కళాశాలలో ట్రైనింగ్ ఐఏఎస్ అధికారుల పరిశీలన
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
కర్నూలు జిల్లా బనవాసిలోని జవహర్ నవోదయ విద్యాలయంను ట్రైనీ ఐ ఏ ఎస్ అధికారులు ప్రియం వధా, భరత్, హుస్సేన్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించి, విద్యాలయంలోని విద్యా మరియు సహపాఠ్య కార్యక్రమాలను పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు విద్యాలయంలో జరుగుతున్న వివిధ విద్యా, సాంస్కృతిక, క్రీడా మరియు ఇతర విద్యార్థి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆరా తీశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతులు, వంటశాల, కిచెన్ గార్డెన్, విద్యాలయంలోని గార్డెన్లు, పార్కులు మరియు పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు.అలాగే విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారికి విద్యాలయంలో ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా, వసతి, భోజనం, విద్య, ఆరోగ్యం తదితర అంశాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలను తెలుసుకున్నారు.
విద్యాలయంలోని పచ్చని పరిసరాలు, పరిశుభ్రమైన వాతావరణం, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు మరియు చక్కగా నిర్వహిస్తున్న కిచెన్ గార్డెన్, గార్డెన్లు, పార్కులను చూసి ట్రైనీ ఐ ఏ ఎస్ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.ఇంత మంచి వాతావరణంలో విద్యార్థులు చదువుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇలాంటి ప్రశాంతమైన, పరిశుభ్రమైన వాతావరణం ఎంతో ఉపయోగకరం అని వారు అభినందించారు.విద్యార్థుల అభివృద్ధికి విద్యాలయం చేస్తున్న కృషిని అధికారులు ప్రశంసించారు. ఈ ఆకస్మిక తనిఖీ సందర్భంగా విద్యాలయ ప్రిన్సిపాల్ ఈ. పద్మావతి అధికారులు పరిశీలించిన అంశాల గురించి వివరించారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యాలయంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యా వాతావరణం మరియు సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.స్వచ్ఛభారత్ లో భాగంగా విద్యాలయం ఎప్పుడు ఇలాగే ఉంటుంది అధికారులకు ప్రిన్సిపాల్ వివరించారు