సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వానికి ఎందుకు భయం?
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వానికి ఎందుకు భయం?
చరిత్రను దాచిపెట్టే ప్రయత్నాలు మానుకోవాలి
బిజెపి రాష్ట్ర ప్రతినిధి చాడ శ్రీనివాస్ రెడ్డి
హుస్నాబాద్ : చాడ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల చరిత్రలో మరచిపోలేని రోజు నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన ఈ చారిత్రక రోజును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం తెలంగాణ చరిత్రను అవమానించడమేనని తీవ్రంగా మండిపడ్డారుతెలంగాణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన వేలాది మంది వీరుల త్యాగాలను నాటి నేటి ప్రభుత్వాలు ఎందుకు గుర్తించలేకపోతోందని ప్రశ్నించారు. ఓట్ల రాజకీయాల కోసం చరిత్రను పక్కన పెట్టడం సిగ్గుచేటని అన్నారు_
విమోచన దినోత్సవం నిర్వహిస్తే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి?
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించేందుకు ఈ ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల విముక్తి చరిత్రను అధికారికంగా గుర్తించడానికి కూడా రాజకీయ లెక్కలు చూసుకుంటున్నారా? అని ప్రశ్నించారు?
చరిత్రను దాచిపెట్టినంత మాత్రాన చరిత్ర మారదు. తెలంగాణ ప్రజలు వాస్తవ చరిత్రను ఎప్పటికీ మర్చిపోరని అన్నారు
ఈ ప్రభుత్వం సెప్టెంబర్ 17.ను అధికారికంగా నిర్వహించకపోతే బీజేపీ రాష్ట్రంలో అధికారంలో వచ్చాక చారిత్రక పోరాటాలను గౌరవిస్తూ అధికారికంగా సెప్టెంబర్ 17ను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా పండుగల నిర్వహిస్తామని అన్నారు
రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ డిమాండ్లు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి,అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించాలి, తెలంగాణ విమోచన పోరాట యోధుల కుటుంబాలను ఘనంగా సత్కరించాలి, పాఠశాలలు, కళాశాలల్లో తెలంగాణ విమోచన చరిత్రపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి,తెలంగాణ విమోచన పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ, తెలంగాణ చరిత్రను ప్రభుత్వం ఓట్ల కోసం బలిపెట్టాలని చూస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించే వరకు ప్రజల పక్షాన బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారుఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం, అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి పైడిపల్లి పృద్విరాజ్, రాష్ట్ర నాయకురాలు లక్కిరెడ్డి తిరుమల, తోట స్వరూప, హుస్నాబాద్, అక్కనపేట, కోహెడ, చిగురుమామిడి, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి బిజెపి మండలాల అధ్యక్షులు బుక్యా సంపత్ నాయక్, రామంచ మహేందర్ రెడ్డి, జాలిగం రమేష్, పోలోజు సంతోష్, శ్రీరామోజు శ్రీనివాస్, మంతుర్తి శ్రీకాంత్ యాదవ్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు వెల్దండి రాజేంద్రప్రసాద్, రాయికంటి చందు, లకావత్ శారదా, పిల్లి నర్సయ్య, కుడితాడి చిరంజీవి, పల్లెపాటి మదుకర్, అచ్ఛ రవీందర్, వివిధ బాధ్యతల్లో ఉన్న జిల్లా మండల ప్రధాన కార్యదర్శులు మండల పార్టీ మరియు మోర్చాల బాద్యులు తోట సమ్మయ్య, జెల్ల మల్లేశం, తక్కళ్లపల్లి సంపత్ రావు,కంచర్ల శంకరయ్య, దొడ్డి శ్రీనివాస్, గొల్లపల్లి వీరా చారి, పొన్నం శ్రీనివాస్, తగురం లక్ష్మణ్, కాయిత అరుణ్ రెడ్డి, బైరి అరుణ్, తడిసిన రమేష్, మడక రవి కుమార్, పెర్యాల సాగర్ రావు, దొంగల రానా ప్రతాప్, అయ్యావుల రాజు, బుద్ధర్తి మహేందర్, పెరమండ్ల భరద్వాజ్, చిదిరాల వెంకటేష్, నాగు అజయ్, ఎర్రోజు సాయి, భూశంకర్,ఎర్రవెల్లి ప్రశాంత్, నందకుమార్, బోగ మహేష్కర్, మురళీధర్, మళ్ళెం ప్రశాంత్, గౌరవేని మనెమ్మ, తిరుపతి, నారోజు నరేష్, గుతాగడ్డపు బాలరాజు, లావుడియా రాజన్ నాయక్,బత్తుల శ్రీనివాస్, కండే శంకర్, గుండాల ప్రశాంత్, సొల్లు రజినీకాంత్, బొల్లి సుధాకర్, ఇటికాల కుమారస్వామి, వంగ శ్రీనివాస్ రెడ్డి, బొమ్మగాని ఈశ్వర్, సలేంద్ర తిరుపతి, గంగూల కుమార్, బొల్లంపల్లి శ్యామ్, గుండు సారయ్య, లక్కిరెడ్డి మల్లారెడ్డి, గుండెల్లి సదానందం, దొంగల వేణు, దొంత కరుణాకర్, మాటూరి విద్యాసాగర్, హింగే దేవరావు, సుఖినే సుధాకర్, అందవేని రాములు, అసెంబ్లీలోని ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు