ప్రీ ప్రైమరీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్
పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం కావాలి
ఎఫ్ ఎల్ ఎన్ లక్ష్యసాధనలో ముందుండాలి
మధ్యాహ్న భోజనం నాణ్యతతో అందించాలి.
ప్రీ ప్రైమరీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్.
పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం కావాలని, ఎఫ్ ఎల్ ఎన్ లక్ష్యసాధనలో ముందుండాలని,మధ్యాహ్న భోజనం నాణ్యతతో విద్యార్థులకు అందించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఉపాధ్యాయులకు సూచించారుమంగళవారం రోజున రామాయంపేట మండలం అక్కన్నపేట మండలంలో ప్రీ ప్రైమరీ , మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల గురించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారా లేదా అని విద్యార్థులతొ పాటు క్లాస్ రూమ్ లో కూర్చుని టీచర్ బోధనను అలాగే విద్యార్థులు మన్నన చేసుకునే విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.