BREAKING
ఒమన్ తీరానికి సమీపంలో ఎల్ గైయాపై దాడి ఏఐ భద్రతా ఆందోళనలను కొట్టిపారేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హోర్ముజ్ జలసంధిపై చర్చలు వాయిదా ఫెడ్, బీఓజే సమావేశాల వేళ ఆసియా షేర్లలో తడబాటు రష్యా వీటీబీ బ్యాంక్‌పై అమెరికా కొత్త ఆంక్షలు రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం హర్మూజ్ జలసంధిలో భారీ పేలుడు.. నౌకా మైన్లు ఢీకొని మంటల్లో చిక్కుకున్న ఆయిల్ ట్యాంకర్ ఘనంగా ప్రముఖ నటి సమంత సీమంతం వేడుక.. ఫొటోలు వైరల్ ప్రధాని, సీఎంలకు బాంబు బెదిరింపుల కేసు.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ఇద్దరి అరెస్ట్ పులివెందులలో టిడిపి వర్సెస్ టిడిపి వర్గీయుల మధ్య తీవ్ర గర్షణ గుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడి మృతి ఘనంగా సమంత సీమంతం వేడుక.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్! టాలీవుడ్‌లో కొత్త చర్చకు తెరలేపిన తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ఫొటో.. వినాయక చవితి వేడుకల్లో జంటగా సందడి! ముంబైలో ఘనంగా అంబానీ నివాసంలో గణేశుడి వేడుకలు.. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు! నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీకి కసరత్తు!

గుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడి మృతి

Select Suryaa Now
గుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడి మృతి

సూర్య బిక్కనూర్:
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న శ్రీనాథ్(58) అనే వ్యక్తి సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు మండల విద్యా వనరుల అధికారి రాజాగంగారెడ్డి తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బెంగళూరులో ఉన్న తన కుమారుని వద్దకు వెళ్లిన శ్రీనాథ్ గుండెపోటు రావడంతో, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా శ్రీనాథ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం. ఆయన మృతి పట్ల మండల ఉపాధ్యాయులు, రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు