BREAKING
ఉపాధ్యాయుడే.. సమాజ నిర్మాత తిరుమల బ్రహ్మోత్సవాలు: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ రాస్తే జైలుకే.. పోలీసుల సీరియస్ వార్నింగ్! ఏపీ ప్రజలకు అలర్ట్: నేడు, రేపు విస్తారంగా వర్షాలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్! ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికె ప్రజాదర్బార్: మంత్రి వాసంశెట్టి సుభాష్ గిరిజనుల ఆశాజ్యోతి కేసీఆర్ -మున్సిపల్ చైర్మన్ సంకెపల్లి రఘునందన్ రెడ్డి రాజన్న ప్రసాదంగా రైతులకు కోడెల పంపిణీ.... ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియోజకవర్గ విజన్ ప్లాన్ యూనిట్ల అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఎస్పీడీసీఎల్ (సీజీఎం) సుధాకర్ కుమార్ కరీంనగర్‌లో 49,025 మంది విద్యార్థులకు ‘స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 16న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ పోషకాహారం, ఏకాగ్రత, హాజరు పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు కరీంనగర్ మార్కెట్ యార్డులో రూ.8 కోట్లతో 50 వేల మంది విద్యార్థుల సామ పార్టీలకు అతీతంగా బాధిత కుటుంబానికి మంత్రి అడ్లూరి అండ ఘనంగా వినాయక చవితి వేడుకలు గుంటూరు మేయర్ రేసులో మాదాల చైతన్య ఘనంగా వినాయక చవితి వేడుకలు మట్టి వినాయకుని ప్రతిమలు పంపిణి నంద్యాలలో తాగునీటి సరఫరాలో అంతరాయం

గిరిజనుల ఆశాజ్యోతి కేసీఆర్ -మున్సిపల్ చైర్మన్ సంకెపల్లి రఘునందన్ రెడ్డి

Select Suryaa Now
గిరిజనుల ఆశాజ్యోతి కేసీఆర్ -మున్సిపల్ చైర్మన్ సంకెపల్లి రఘునందన్ రెడ్డి

గిరిజనుల ఆశాజ్యోతి కేసీఆర్

-మున్సిపల్ చైర్మన్ సంకెపల్లి రఘునందన్ రెడ్డి

​తిరుమలగిరిమేజర్ న్యూస్ :- తెలంగాణ రాష్ట్రం లోని గిరిజనుల ఆశాజ్యోతి  బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సంకెపల్లి రఘునందన్ రెడ్డి అన్నారు. మంగళవారం బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతికి చేపట్టిన చారిత్రాత్మక నిర్ణయాలకు గుర్తుగా ఈ నెల 17న తిరుమలగిరి మండల కేంద్రంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ​​గిరిజన తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి , గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుండి 10 శాతానికి పెంచడమే కాకుండా, ప్రతి తండాలో మౌలిక సదుపాయాలు తో పాటు డంపింగ్ యార్డ్, స్మశాన వాటికలు తండాలలో మౌలిక వసతులు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. తెలంగాణ జాతిపిత, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేక నిర్వహించే కార్యక్రమానికి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని ఆయన చెప్పారు.  మండలంలోని అన్ని ఎస్టీ గ్రామపంచాయతీల వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం తిరుమలగిరి మండల కేంద్రంలో నిర్వహించే కార్యక్రమానికి అందరూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరుకావాలని కోరారు.  ఈ కార్యక్రమానికి  కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.   ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సురేందర్,  ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు యాకూబ్ నాయక్, ధూపటి రవీందర్, వీరన్న, వెంకట్ రెడ్డి,  యాకూబ్ నాయక్, రవీందర్, మోహన్ బాబు,  యాకూబ్ పాషా, సికిందర్, దేవా, కందుకూరి బాబు, సైదులు,  ప్రజాప్రతినిధులు తదితరులు  పాల్గొన్నారు.