BREAKING
భక్తుల మనోభావాలు దెబ్బతీయనీయం ఈనెల 19న కోదాడలో మెగా జాబ్ మేళా...సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్య టాలీవుడ్ నుంచి మరో కొత్త తరహా ఎంటర్‌టైనర్.. రాగ్ మయూర్ 'అనుమాన పక్షి' ట్రైలర్ రిలీజ్! టెక్ రంగంలో మళ్లీ లేఆఫ్స్ కలకలం: తెల్లవారుజామునే ఒరాకిల్ ఉద్యోగులకు పింక్ స్లిప్స్.. కారణం అదేనా? ఉపాధ్యాయుడే.. సమాజ నిర్మాత తిరుమల బ్రహ్మోత్సవాలు: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ రాస్తే జైలుకే.. పోలీసుల సీరియస్ వార్నింగ్! ఏపీ ప్రజలకు అలర్ట్: నేడు, రేపు విస్తారంగా వర్షాలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్! ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికె ప్రజాదర్బార్: మంత్రి వాసంశెట్టి సుభాష్ గిరిజనుల ఆశాజ్యోతి కేసీఆర్ -మున్సిపల్ చైర్మన్ సంకెపల్లి రఘునందన్ రెడ్డి రాజన్న ప్రసాదంగా రైతులకు కోడెల పంపిణీ.... ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియోజకవర్గ విజన్ ప్లాన్ యూనిట్ల అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఎస్పీడీసీఎల్ (సీజీఎం) సుధాకర్ కుమార్ కరీంనగర్‌లో 49,025 మంది విద్యార్థులకు ‘స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 16న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ పోషకాహారం, ఏకాగ్రత, హాజరు పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు కరీంనగర్ మార్కెట్ యార్డులో రూ.8 కోట్లతో 50 వేల మంది విద్యార్థుల సామ పార్టీలకు అతీతంగా బాధిత కుటుంబానికి మంత్రి అడ్లూరి అండ ఘనంగా వినాయక చవితి వేడుకలు

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికె ప్రజాదర్బార్: మంత్రి వాసంశెట్టి సుభాష్

Select Suryaa Now
ప్రజా సమస్యల సత్వర  పరిష్కారానికె ప్రజాదర్బార్: మంత్రి వాసంశెట్టి సుభాష్

సూర్య, రామచంద్రపురం:ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గం చూపించడమే లక్ష్యంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు రామచంద్రపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి నేరుగా వివరించి, పరిష్కారం కోరుతూ మొత్తం 28 అర్జీలు సమర్పించారు. రోడ్లు, డ్రైన్లు, ఇళ్ల స్థలాలు కోరుతూ అర్జీలు అందాయి. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని మంత్రి సుభాష్ శ్రద్ధగా స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ప్రజాదర్బార్ నిర్వహించడం ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ అందరికీ అందుబాటులో ఉండే పాలనకు మంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరంతరం కృషి చేస్తామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ సలాది రమేష్, కంచుమర్తి బాబురావు,రామచంద్రపురం రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, కూటమి నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆర్జీదారులు పాల్గొన్నారు.