కరీంనగర్‌లో 49,025 మంది విద్యార్థులకు ‘స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 16న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ పోషకాహారం, ఏకాగ్రత, హాజరు పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు కరీంనగర్ మార్కెట్ యార్డులో రూ.8 కోట్లతో 50 వేల మంది విద్యార్థుల సామ
సూర్య కరీంనగర్ ప్రతినిధి:
పాఠశాల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారాన్ని అందించడం ద్వారా వారి ఆరోగ్యం, ఏకాగ్రత, హాజరు, విద్యా సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ పార్టనర్ గా
చేపట్టిన " స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్" ను కరీంనగర్ జిల్లాలో విస్తరిస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులోసుమారు రూ.8 కోట్ల వ్యయంతో, రోజుకు 50 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందించే సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను సెప్టెంబర్ 16న రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు .కరీంనగర్‌లోని ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా కరీంనగర్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లోని 17 మండలాల పరిధిలో 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన మొత్తం 49,025 మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందించనున్నారుఈ కార్యక్రమాన్ని హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ పార్ట్‌నర్‌గా అమలు చేయనుంది.